ఎంటర్టైన్మెంట్

యూరప్ టూర్‏లో వైన్ టెస్టింగ్ సెషన్‏లో చైతూ, శోభితా..! వైరల్ అవుతున్న ఫొటో.

నాగ చైతన్య, సమంత విడాకులతో విడిపోయిన తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. అయితే చైతూ మాత్రం శోభితాతో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ మధ్యే శోభితా కూడా దీనిపై స్పందించింది. జీక్యూ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ప్రేమలో ఉన్నారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది. అయితే చాలాసార్లు వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా.. ఆ రూమర్స్ పై ఇద్దరూ స్పందించలేదు.

దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం నిజమేనంటూ వస్తున్న రూమర్లకు మరింత బలం చేకూరింది. అంతేకాదు.. వీరిద్దరు తమ ఇన్ స్టా ఖాతాలలో షేర్ చేసే ఫోటోస్ బ్యాగ్రౌండ్స్ ఒకే విధంగా ఉండడంతో ఇద్దరు కలిసి వెకేషన్ వెళ్లారని ఇట్టే కనిపెట్టేవారు. ఇక ఇప్పుడు మరోసారి చైతూ, శోభితా పేర్లు వార్తలలో నిలిచాయి. ఈ ఇద్దరికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. యూపర్ లోని ఓ బార్ లో వైన్ టెస్టింగ్ సెషన్ లో చైతూ, శోభిత పాల్గొన్నట్లుగా ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

అందులో చైతూ ఇప్పుడు తండేల్ సినిమా కోసం ఉన్న లుక్ లోనే కనిపించడంతో ఇద్దరు కలిసే వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు. చైతూ, శోభితా చాలా రోజులుగా కలిసే వెకేషన్ వెళ్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. చైతూ అభిమానులు మాత్రం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఇలా నెటిజన్స్ చైతూ, శోభితా ఫోటోస్ పై విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ మూవీలో కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అలాగే శోభితా విషయానికి వస్తే తెలుగు, హిందీతోపాటు హాలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం సితార అనే సినిమాలో నటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *