తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరుకుతున్నాయ్, చిన్న రాయి దొరికినా చాలు, మీ జీవితమే మారిపోతుంది.

పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మూడు వజ్రాలు దొరికాయి. దీంతో ఆ అన్నదాతలు తెగ సంబరపడ్డారు. ఆ మూడు వజ్రాల విలువ 20 లక్షల వరకు ఉంటుందని స్థానిక వ్యాపారి అంచనా వేశారు. ఆ రైతులకు డబ్బు అవసరం ఉందో ఏమో 15 తులాల బంగారం ఇస్తే స్థానిక వ్యాపారికి ఇచ్చేశారు. వజ్రాలు దొరికినప్పటికీ తక్కువ ధరకు విక్రయించారు. అయితే రాయలసీమ రతనాల సీమ..అంటారు.. ఇప్పుడు నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారింది.

సాధారణంగా మట్టిలో రాళ్లు రప్పలు కనిపిస్తుంటాయి.. కానీ.. ఇక్కడ మాత్రం వజ్రాలు కనిపిస్తుంటాయి.. అదికూడా వర్షా కాలంలో మాత్రమే.. సాధారణంగా వర్షం పడితే మట్టి వాసన రావడం సహజం.. కానీ రాయలసీమలో మాత్రం నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటపడతాయి. ఇప్పుడు వర్షాకాలం మొద‌లు కావ‌డంతో వ‌జ్రాల కోసం వేట ప్రారంభించారు. ముఖ్యంగా కర్నూలు ప్రాంత ప్రజలు పనులన్నింటిని వదులుకుని వజ్రాల వేటలో పడ్డారు.

ఏదైనా వజ్రం దొరకకపోతుందా..? తమ పంట పండకపోతుందా..? అదృష్టం కలిసిరాకపోతుందా…? అంటూ తమ పంటపొలాల్లో సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా జొన్నగిరిలో కొందరికి బంపర్ ఆఫర్ లెక్క.. మూడు వజ్రాలు లభ్యమయ్యాయి. ఓ వజ్రం 6 లక్షల యాభై వేలు, మరో వజ్రం 2 లక్షల యాభై వేలకు విక్రయించగా.. ఇంకో వజ్రం లక్షా ఇరవై వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు.

మూడు రోజుల్లో నాలుగు వజ్రాలు దొరకడంతో.. జొన్నగిరికి పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషకులు చేరుకుని వేటను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా.. క‌ర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంత‌పురం జిల్లా వ‌జ్రక‌రూరులో వ‌జ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు, కోసిగిలోని పంటపొలాల్తొలో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి. దీంతో వర్షాలు కురుస్తుండటంతో వ‌జ్రపు రాళ్లు బ‌య‌ట‌ప‌డకపోతాయా..? తమ పంట పండకపోతుందా అంటూ వజ్రాల అన్వేషకులు ఈ ప్రాంతాల్లో సెర్చింగ్ మొదలుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *