ఢిల్లీ మెట్రో కోచ్‌లలో ఇలాంటి వీడియో చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనిపై డిఎంఆర్సీ ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. గత నెలలో మెట్రోలో వీడియోల రికార్డింగ్‌ను నిషేధించింది. మెట్రోలో ప్రయాణించండి.. కానీ న్యూసెన్స్ సృష్టించకండి అంటూ ట్వీట్ చేసింది.అయినా ఫలితం లేకపోయింది. అయితే ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేసి వార్తల్లోకెక్కింది. అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది.…