ఆరోగ్యం

షుగర్ పేషెంట్స్‌కు అలర్ట్, ఈ వ్యాధితో జాగర్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. అయితే షుగర్ పేషెంట్లు ఆహారం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా శరీరంలో షుగర్ లెవల్ పెరిగిపోవచ్చు. రక్తంలో చక్కెర శాతం సడన్‌గా పెరగడాన్ని హైపర్‌గ్లైసీమియా అంటారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతే దాహం, తరచుగా మూత్రవిసర్జన, చూపు మందగించడం, తలనొప్పి, అలసట, చిరాకు, కంటిలో దురద వంటి షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.

లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. షార్ట్-టర్మ్ ఎఫెక్ట్స్ : రక్తంలో చక్కెర స్థాయి సడన్‌గా పెరిగినప్పుడు మొదట ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే, చక్కెర రక్తంలోకి త్వరగా వెళ్లి గ్లూకోజ్‌గా మారుతుంది. ఈ గ్లూకోజ్ శరీరంలోని కణాలకు శక్తిని అందిస్తుంది. కానీ, ఈ ఎనర్జీ బూస్ట్ తరువాత షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతాయి. ఫలితంగా అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చక్కెర హార్మోన్లను విడుదల చేస్తుంది, ఈ హార్మోన్లు ఆకలిని పెంచుతాయి. అంటే ఇప్పుడే తిన్నా మళ్లీ ఆకలిగా అనిపిస్తుంది.

లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ : బ్లడ్ షుగర్ లెవల్స్ తరచుగా పెరుగుతుంటే క్రమంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే, శరీరం ఎక్స్‌ట్రా షుగర్‌ను కొవ్వుగా స్టోర్ చేయడం ప్రారంభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి బాడీ నిరంతరం కృషి చేయాల్సివస్తే, అది ఇన్ఎఫెక్టివ్‌గా మారిపోవచ్చు. అంటే బాడీ షుగర్ లెవెల్స్ తగ్గించలేదు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. రక్తంలో ఎక్కువ చక్కెర ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలు : హైపర్‌గ్లైసీమియా కారణంగా పక్షవాతం, అల్జీమర్స్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ మొత్తంలో చక్కెర మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. జ్ఞాపకశక్తి లోపం, ఇతర మానసిక వ్యాధులకు ఇది కారణమవుతుంది.

పరిశోధనల ప్రకారం శాచ్యురేటెడ్ ఫ్యాట్, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల వయస్సుతో సంబంధం లేకుండా జ్ఞాపకశక్తి, మానసిక సామర్థ్యాలలో లోపం వస్తుంది. దీనికి కారణం కొవ్వు, చక్కెర కేంద్ర నాడీ వ్యవస్థ పై ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కలిగించడమే. మెదడులోని ఈ భాగం కొన్ని రకాల జ్ఞాపకశక్తిని, అలానే ఆకలి సంకేతాలకు మన రియాక్షన్లను కంట్రోల్ చేస్తుంది. చర్మం ముడతలు : అతిగా చక్కెర తింటే కొల్లాజెన్‌ను రిపేర్ చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. కొల్లాజెన్ అనేది చర్మాన్ని బిగువుగా ఉంచే ఒక ప్రోటీన్. కొల్లాజెన్ తక్కువ ఉంటే చర్మం పలుచగా మారి ముడతలు పడతాయి. చక్కెరను బ్రేక్ చేసే విధానం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గుతుంది, గాయాలు త్వరగా మానవు, ముడతలు ముందే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే స్వీట్స్ మానేయాలి.

తీపిగా ఏదైనా తినాలనుకుంటే పండ్లను తినడం మంచిది. పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఇన్‌ఫ్లమేషన్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి, ఇన్‌ఫ్లమేషన్ వల్ల ముడతలు, కొన్ని వ్యాధులు వస్తాయి. పరిశోధనల ప్రకారం, కొద్ది మోతాదులో తీపి పదార్థాలు ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి. కానీ, ఎక్కువ కాలం పాటు షుగర్ తింటే సమస్యలు వస్తాయి. ఒత్తిడి మళ్లీ తిరిగి వస్తుంది, అంతేకాకుండా మునుపటి కంటే కొంచెం ఎక్కువ తీవ్రంగా ఉంటుంది, దీని ఫలితంగా మరింత చక్కెర తినాలనిపిస్తుంది. పరిశోధనల ప్రకారం షుగర్ కన్‌సంప్షన్‌, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటికి మధ్య సంబంధం ఉంది. ఈ కారణంగా కొంతమంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరింత చక్కెర తింటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *