శ్రీవిద్య 1953 జూలై 24 న భారతదేశంలోని తమిళనాడులో ఉన్న చెన్నైలో, తమిళ చిత్ర హాస్య నటుడు కృష్ణమూర్తి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎం.ఎఎల్. వసంతకుమారి దంపతులకు జన్మించింది. ఆమెకు శంకరరామన్ అనే సోదరుడు ఉన్నాడు. ఆమె పుట్టిన సంవత్సరం ఆమె తండ్రి ముఖ కండరాలపై ప్రభావం చూపే ఒక జబ్బు బారిన పడటంతో నటన నుండి విరమించుకోవలసి వచ్చింది. అయితే 1967లో ఆమె కెరీర్ మొదలైంది. మొదటి చిత్రంలో డాన్సర్ గా కనిపించింది. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ హోదా పొందింది. 70-80లలో ఆమె బిజీ యాక్ట్రెస్. ఏడాదికి 20-30 సినిమాలు చేసేది. శ్రీవిద్య ఎక్కువగా మలయాళంలో చిత్రాలు చేసింది.
అలాగే తమిళంలో కూడా నటించింది. ఓ 50 చిత్రాల వరకు తెలుగులో చేసింది. కన్నడ, హిందీ భాషల్లో సైతం నటించింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో శ్రీవిద్య 800 చిత్రాల వరకు చేసిందని సమాచారం. తెలుగులో ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 90లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. బంగారు బుల్లోడు, ధర్మచక్రం, గాండీవం, ముగ్గురు మొనగాళ్లు వంటి చిత్రాల్లో తల్లి పాత్రలు చేసింది. తెలుగులో శ్రీవిద్య చివరి చిత్రం విజయ్ ఐపీఎస్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు భాషల్లో నటిస్తున్న శ్రీవిద్య అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడింది.
ఆమెకు అరుదైన బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. 2006లో కీమోథెరపీ చేయించుకుంది. అయినా ఫలితం లేకండా పోయింది. ఆమె శరీరాన్ని క్యాన్సర్ కబళించింది. చనిపోతానని తెలిసిన శ్రీదివ్య తన పేరిట ఉన్న ఆస్తులు ఛారిటీకి దానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమె ఒక వీలునామా రాశారు. నటుడు కే బి జ్ఞానేశ్వర్ ట్రస్టీగా ఓ ఛారిటీ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరిట తన ఆస్తులు రాసింది. ఆ ట్రస్ట్ ద్వారా సంగీతం, డాన్స్ స్కూల్ నిర్మించి పేద విద్యార్థులకు కళలు నేర్పాలని ఆమె తెలియజేశారు.
తన బంధువులకు, పనివారికి కొంత మొత్తం ఆర్థిక సహాయం చేసింది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శ్రీవిద్య… క్రిస్టియన్ అయిన జార్జ్ థామస్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. శ్రీదివ్య డబ్బులతో జల్సాలు చేస్తున్న జార్జ్ కి ఆమె విడాకులు ఇచ్చింది. క్యాన్సర్ కారణంగా శ్రీవిద్య 2006లో కన్నుమూశారు. అప్పటికి ఆమె వయసు కేవలం 53 ఏళ్ళు మాత్రమే.