ప్రతి రంగుకు దాని ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు ట్రాఫిక్ లైట్ వద్ద స్టాప్ సిగ్నల్ లేదా డేంజర్ సైన్ కోసం ఎరుపు రంగు ఉపయోగిస్తారు. అదే విధంగా స్కూల్ బస్సు పసుపు రంగులో ఉంటుంది. అయితే స్కూలు, కాలేజీ బస్సులు పసుపు రంగులో ఉండడాన్ని మనం గమనించే ఉంటాం. ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ, విదేశాల్లోనూ ఇదే కోడ్‌ని ఫాలో అవుతుంటారు.
అంతేకాకుండా నిర్మాణ రంగంలో ఉనయోగించే జేసీబీలు, క్రేన్‌లు కూడా పసుపు రంగులోనే ఉంటాయి. అయితే సాధారణంగా ప్రతీ రంగుకు ఒక స్థిరమైన తరంగ ధైర్ఘ్యం ఉంటుంది. వేరు వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేరు వేరు రంగుల్లో ఉంటుంది. కాంతి తరంగ దైర్ఘ్యం, పరావర్తనం (రిఫ్లెక్షన్)లపైనే రంగులు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే పసుపు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కారణంగానే పసుపు రంగు స్పష్టంగా కనిస్తుంది.
మిగిలిన అన్ని రంగులతో పోల్చితే పసుపు రంగు 1.24 రెట్లు వేగంగా మన కంటిని ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే స్కూలు బస్సులకు పసుపు రంగును వేస్తారు. స్కూల్, కాలేజీ బస్సులను ఇతర వాహనదారులు సులభంగా గుర్తించి అలర్ట్ కావడానికే ఇలా చేస్తారు. తక్కువ కాంతిలో కూడా పసుపు రంగు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకే చీకట్లో జేసీబీ యంత్రంతో తవ్వే పనులు చేపట్టినప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ వాహనాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే వీటికి పసుపు రంగు వేస్తారు. కేవలం చీకట్లోనే కాకుండా మంచు, వర్షం కురుస్తున్న సమయాల్లోనూ పసుపు రంగులో ఉండే వాహనాలను సులభంగా గుర్తించవచ్చు. చూశారుగా వాహనాలకు పసుపు రంగు చేయడం వెనకాల ఉన్న అసలు రీజన్ ఏంటో.