తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్. ఒకప్పుడు హీరోయిన్ గా, సహాయ నటిగా అలరించింది. ఆవిడే శరణ్య. కాదల్ కవితై సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. అయితే శరణ్య నాగ్ తాజాగా తిరుత్తని లో గల సుబ్రమణ్య స్వామి టెంపుల్ ని సందర్శించింది. ఆ గుడిలో ఆమె మొక్కు తీర్చుకున్నారు. తల నీలాలు అర్పించింది. అలాగే ఆమె నాలుకకు శూలం గుచ్చుకుంది.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. శరణ్య నాగ్ ని గుండులో చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఆమె భక్తికి ముగ్దులు అవుతున్నారు. శరణ్య నాగ్ కి ఇంత భక్తి ఉందా… అని మెచ్చుకుంటున్నారు. శరణ్య నాగ్ వివాహం తర్వాత నటనకు దూరమైంది. ఆమెకు ప్రేమిస్తే చిత్రం పేరు తెచ్చింది. భరత్-సంధ్య హీరో హీరోయిన్ గా నటించిన ప్రేమిస్తే 2004లో విడుదలై భారీ విజయం అందుకుంది.
ఆ చిత్రంలో శరణ్య నాగ్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసింది. అనంతరం టెన్త్ క్లాస్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. టీనేజ్ లో ప్రేమలో పడి ఇబ్బందులు పడిన అమ్మాయి, అబ్బాయి కథే… టెన్త్ క్లాస్. ఈ చిత్రం సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో శరణ్య నాగ్ కి ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా చిత్రాల్లో శరణ్య నాగ్ నటించింది. ఇవి రెండు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 2014 లో విడుదలైన తమిళ్ మూవీ మూయల్ ఆమె చివరి చిత్రం.
శరణ్య ప్రస్తుతం బొద్దుగా తయారయ్యారు. ఒకప్పటి శరణ్య నాగ్ లుక్ తో పోల్చుకుంటే షాక్ అవుతారు. సిల్వర్ స్క్రీన్ కి దూరమైన శరణ్య నాగ్ సోషల్ మీడియాలో మాత్రం అందుబాటులో ఉంటున్నారు. శరణ్య నాగ్ కి విపరీతమైన భక్తి. తరచుగా ఆమె ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు.