ఆయుర్వేదం

ప్రతి రోజు ఉదయం సబ్జా నీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?

సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలను మంచి పరిమాణంలో నీటితో మన ఆహారంలో చేర్చుకున్నప్పుడు, అవి నీటిని పీల్చుకుంటాయి మరియు తద్వారా మన ప్రేగులకు నీటిని లాగడంలో సహాయపడతాయి. ఇది మలం మృదువుగా మారుతుంది మరియు రోజువారీ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది. అయితే ప్రతి రోజు ఉదయం సబ్జా నీరు తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇందులో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ఖనిజాలు ఉన్న వీటి వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుందట.

మల్లబద్దకం సమస్య కూడా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. యాసిడ్, గ్యాస్ వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయం చేస్తాయి సబ్జా గింజలు. అందుకే ఈ నీటిని తాగాలి అంటున్నారు నిపుణులు. సబ్జా గింజలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయమే తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. అందుకే వీటిని సేవించడం వల్ల బరువు కూడా తగ్గుతారు. మధుమేహ వ్యాదిగ్రస్తులలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సబ్జా నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఇందులోని ఫైబర్ జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్లు శోషణను నెమ్మదిస్తుందట. దీని వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. సబ్జా గింజల్లో యాంటీ అలెర్టిక్ లక్షణాలు ఉన్నాయి. మొటిమలు అలర్జీ వంటి సమస్యల నుంచి కూడా రక్షిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో సబ్జా గింజల నీటిని తాగితే చర్మం మెరుస్తుందట. సబ్జా గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం పడతాయి.

సబ్జా గింజలు గుండెపోటును నివారించడంలో తోడ్పడతాయి. అంతేకాదు రక్తం గోడకట్టే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి. సబ్జా గింజలు గుండె రుగ్మతలకు కూడా సహాయం చేస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి. ఇందులో మెగ్నీషియం, ఇతర పోషకాలు న్యూరోట్రాన్స్మిటర్ పనితీరును కూడా నియంత్రిస్తాయి. అందుకే రెగ్యూలర్ గా సబ్జా వాటర్ ను తాగడం అలవాటు చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *