ఆయుర్వేదం

రోడ్డు పక్కన గుత్తులుగా కాయలు పిచ్చి కాయలు అనుకుంటే పొరపాటే..! ఈ కాయలు తింటే వందల వ్యాధులు తగ్గిపోతాయి.

ఈ పండ్లు అర‌గ‌డానికి చాలా సమ‌యం ప‌డుతుంది. కనుక వీటిని త‌క్కువ మోతాదులో అన‌గా రోజుకు 5 నుండి 10 విరిగి పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. అయితే చాలా మంది ఈ విరిగి చెట్టును మ‌న సాంప్ర‌దాయ ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తార‌ని తెలియ‌దు. ఈ చెట్టు ఆకులు, వేర్లు, బెర‌డు, పండ్లు, విత్త‌నాలు అన్ని కూడా యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలను అధికంగా క‌లిగి ఉంటాయి. అయితే ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. విరిగి కాయ‌ల చెట్టు మూడు నుండి నాలుగు మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ విరిగి చెట్టుకు కాయ‌లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. విరిగి కాయ‌లు ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ఆకుప‌చ్చ రంగులో, అలాగే పండిన త‌రువాత లేత ఎరుపు రంగులోకి మారుతాయి. వీటి కాయ‌ల లోప‌ల కండ క‌లిగి సాగే గుణంతో తీపి పదార్థం ఉంటుంది.

అందుకే దీనిని బంక కాయ‌ల చెట్టు అని పిలుస్తారు. ఈ విరిగి కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని తినడం మూలంగా డయాబెటిస్ అదుపులోకి వస్తుందని పరిశోధనలలో రుజువైంది. ఈ పండ్లు తినడం మూలంగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ అవుతుంది. మలబద్ధకం అజీర్తి గ్యాస్ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో చర్మంపై కురుపులు రావడం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ బంక చెట్టు ఆకులను మెత్తగా నూరుకుని ప్రభావిత చర్మంపై రాస్తే ఉపశమనం పొందుతారు. దురద, అలెర్జీ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ మొక్క సహాయపడుతుంది.

ఇందుకోసం ఈ నక్కెర పండ్ల గింజలను మెత్తగా రుబ్బుకుని దురద ఉన్న చోట రాస్తే ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పిని తగ్గించడానికి ఈ చెట్టు బెరడు కషాయం పనిచేస్తుంది. ఇందులో బెరుడు నీటిలో వేసి మరిగించి, దానిని వడపోసి త్రాగాలి. రుచి కోసం నల్ల మిరియాలు, తేనెను కలుపుకోవచ్చు. ఇది మీ గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాదు, ఈ చెట్టు బెరడు కషాయం మహిళలకు పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం అందిస్తుంది. కొన్ని పదార్థాలు తిన్న తర్వాత చాలా మందికి చిగుళ్లు, పంటి నొప్పి మొదలవుతాయి. ఇది మొత్తం నోటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల నోటిపూత కూడా నయమవుతుంది.

నోటి ఆరోగ్యం కోసం నక్కెర చెట్టు బెరడు పొడిని తీసుకుని, రెండు కప్పుల నీటిలో కలిపి, మరిగించి, ఈ పానీయం తాగాలి. లేదంటే ఈ కషాయంతో నోటిని పుక్కిల్లించిన కూడా ఫలితం ఉంటుంది. దీంతో పంటి నొప్పి, అల్సర్లు, చిగుళ్ల వాపులు అన్నీ మాయమవుతాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారిలో కీళ్ల నొప్పుల నుండి గ్లుబెర్రీ రెగ్యులర్ వినియోగం ఉపశమనం కలిగిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఈ గ్లూబెర్రీ పండ్లు, ఆకులు అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు.. మీ వయస్సు కంటే ముందే మీ జుట్టు బూడిద రంగులోకి మారుతున్నట్లయితే, బంక చెట్టు మీకు వంటింటి ఔషధంగా పనిచేస్తుంది.

దీని పండ్ల నుండి తీసిన రసాన్ని జుట్టు మీద అప్లై చేయడం వల్ల నెరిసిన జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీరు ఈ పండ్ల రసాన్ని నూనెతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంతో తలనొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ పండ్లు అర‌గ‌డానికి ఎక్కువ సమ‌యం ప‌డుతుందట. కనుక వీటిని త‌క్కువ మోతాదులో రోజుకు 5 నుండి 10 విరిగి పండ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *