తాజా వార్తలు

ఎవరైనా చనిపోతే RIP అని అంటారు. దాని వెనుకున్న ఈ స్టోరీ మీకు తెలుసా..?

RIP అనేది ఒక షార్ట్ వర్డు అయినప్పటికీ ఇప్పుడు ఇది ఒక పదం గా వాడేస్తున్నారు. ఇంతకీ ఇక RIP అర్థం ఏమిటి అంటే ఎవరైనా మరణించిన తర్వాత సంబంధీకులు ఇక ఈ పదం ద్వారా తమ బాధను వ్యక్తపరుస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉంటారు.. ఈ అర్థం కొంతమందికి తెలుసు.

అయితే RIP అనేది షార్ట్ వర్డ్ అయినప్పటికీ, ఇప్పుడు అది ఒక పదంగా వాడుతున్నారు.చాలా మందికి ఈ పదానికి ఖచ్చితమైన అర్థం, పూర్తి రూపం కూడా తెలియదు. ఎవరైనా మరణించిన తర్వాత సంబంధీకులు ఈ పదం ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తారు.ఇంతేకాకుండా ఈ పదం ఎప్పుడు ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం.

‘రిప్’ అంటే ‘రెస్ట్ ఇన్ పీస్’.రెస్ట్ ఇన్ పీస్.ఇది లాటిన్ పదబంధం ‘రిక్విస్‌కాట్ ఇన్ పీస్’ నుండి ఉద్భవించింది. Requiescat In Pace అంటే ‘శాంతితో నిద్రపోవడం’. తెలుగులో ఈ పదానికి అర్థం ‘ఆత్మకు శాంతి కలగాలి’. మరణం తర్వాత ‘ఆత్మ’ శరీరం నుండి విడిపోతుందని. ‘తీర్పు దినం’ రోజున రెండూ తిరిగి కలుస్తాయని క్రైస్తవ మతంలో నమ్ముతారు.

ఒక వ్యక్తి చర్చిలో మరణిస్తే, అతని ఆత్మ యేసు క్రీస్తుతో సరిపోలుతుందంటారు. RIP అనే పదాన్ని ఉపయోగించడం 18వ శతాబ్దానికి చెందినదని చెబుతారు. దీనికి ముందు, 5వ శతాబ్దంలో సమాధులపై ‘రిక్విస్‌కాట్ ఇన్ పీస్’ అనే పదాలు కనిపించాయి. క్రిస్టియానిటీ వ్యాప్తితో ఈ పదం వాడకం పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *