తాజా వార్తలు

మహిళలకు శుభవార్త, భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.

మార్చి, ఏప్రిల్‌ నుంచి బంగారం ధరలు కొండెక్కి కూర్చువడంతో సామన్య ప్రజలు కొనాలంటేనే భయపడుతున్నారు. కాగా, గత పది రోజుల క్రితం కాస్త ధరలు తగ్గి దిగివచ్చిన బంగారం మళ్లీ ఇప్పుడు భారీగా పెరిగిపోయి షాక్‌ ఇస్తుంది. అయితే బంగారం ఇలా ఉన్నట్టుండి పెరిగిపోవడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో యుద్దాలు బంగారం, వెండిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈమధ్య బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా.. మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధర రూ.75 వేల మార్క్‌కి చేరుకుంది. ఇలా పెరుగుతూ పోయిన బంగారం ధరలు గత మూడు రోజులుగా స్వల్పంగా తగ్గడమే కాకుండా.. నేడు భారీగా తగ్గాయి. ముఖ్యంగా నేడు తులం బంగారంపై ఏకంగా రూ.1000 తగ్గింది. అయితే నిన్న అనగా గురువారం (మే 23) బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ.67,300గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,420 వద్ద కొనసాగుతోంది.

ఇకపోతే దేశంలోని ప్రధాన నగారాలు ఢిల్లీలో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73570గా కొనసాగుతుంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67300 ఉండగా..24 క్యారెట్ల 10 ధర రూ.73420గా ఉంది. దీంతో పాటు బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా కొనసాగుతుంది.

అలాగే నేడు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ.3,300 తగ్గి.. రూ.92,500లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,500 ఉండగా.. ముంబైలో రూ.92,500గా ఉంది. చెన్నైలో రూ.97,000లుగా నమోదవగా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.97,000లుగా ఉంది. కిలో వెండి ధర బెంగళూరులో రూ.95,600గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *