ఎంటర్టైన్మెంట్

ఫోన్ పే, గూగుల్ పేలో కరెంట్ బిల్ కడుతున్నారా..? RBI కొత్త రూల్ తెలిస్తే..?

ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎం,అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టవద్దని కోరింది. RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అయినా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి వాటిని వినియోగించి.. వివిధ రకాల బిలులను చెల్లించే వారు.

అంతేకాక ఆన్ లైన్ షాపింగ్ తో పాటు కరెంట్ బిల్లు వంటి ప్రభుత్వానికి చెల్లించే నగదును కూడా వీటి ద్వారానే చాలా మంది చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిలులు చెల్లించేవారు.. ఇక నుంచి ఆ వాటి ద్వారా పేమెంట్స్ చేయలేరు. అయితే తెలంగాణ విద్యుత్ శాఖ గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటి ద్వారా చేసే కరెంట్ బిల్లుల చెల్లింపును నిలుపుదల చేసింది. ఈ క్రమంలోనే విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్ పీడీసీఎల్ కీలక సూచన చేసింది.

ఆర్బీఐ ఆదేశాలకు ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే నేటి నుంచి కరెంట్ బిల్లులను టీజీఎస్ పీడీసీఎల్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే.. టీజీఎస్ పీడీసీఎల్ కి సంబంధించిన మొబైల్ యాప్ ద్వారా చెల్లించాలని వినియోగదారులను కోరింది.

మొత్తం ఈ నెల నుంచి కరెంట్ బిల్లు కట్టే వారు ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటితో చెల్లించడం సాధ్యకాదు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చెేసే ఆన్ లైన్ ట్రాన్ జెక్షన్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలను జారీ చేసింది. వాటికి అనుగుణంగానే తాజాగా టీజీఎస్ పీడీసీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *