చాలా తక్కువ రోజుల్లోనే పవన్ కి తన మొదటి భార్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక పవన్ ఆ తర్వాత సినీ నటి రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు బద్రి సినిమాలో నటించి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్యలో ప్రేమ పుట్టిందట. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జానీ సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా సమయంలో వీరి ప్రేమ మరింత ముదిరింది. దానితో వీరిద్దరూ కలిసి ఒకటయ్యారు.
ఈ జంటకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట కూడా దూరం అయింది. వీరిద్దరు విడిపోయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ , అన్నా లేజ్నేవా అనే విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారు. కాగా, పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత అతని భార్య అన్నా లెజ్‌నెవా లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
ఈ నేపథ్యంలో అన్నా లెజ్‌నెవా గురించి ఆసక్తి మొదలైంది. రష్యాకు చెందిన మోడల్ అయినా అన్నా లెజ్‌నెవా 1980లో రష్యాలో జన్మించారు. మోడల్ అయిన తర్వాత పలు భారతీయ సినిమాలోనూ, దక్షిణాది చిత్రాల్లోనూ మెరిశారు. పవన్ కల్యాణ్ తీన్‌మార్‌లో నటిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2013లో వివాహం చేసుకున్నారు. 2017లో అన్నా లెజ్‌నెవా, పవన్‌లకు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు.
పవన్, అన్నా దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. ఆ బాలిక పేరు పొలేనా అంజనా పవనోవా. మోడలింగ్ కెరీర్ మాత్రమే కాకుండా అన్నా బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకు సింగపూర్‌లో హోటల్ చైన్ బిజినెస్ ఉన్నట్టు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ పేర్కొంది. ఆమెకు రష్యాలోనూ, సింగపూర్‌లోనూ ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.1800 కోట్లు అని సమాచారం.