పసుపును, అల్లం పొడిని కలిపి ఎలా తీసుకోవాలంటే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, చిటికెడు అల్లం పొడి కలుపుకొని తాగితే ఎంతో మంచిది. అల్లం పొడి లేకపోతే అల్లం తురుమును వేసుకోవచ్చు. లేదా అల్లం రసాన్ని కలుపుకున్నా చాలు. అయితే మన దేశంలో దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో పసుపు ఉంటుంది. అల్లం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలను ఏ మాంసాహార వంటలోనైనా తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇవి ఆహారం రుచిని పెంచడమేకాకుండా పోషక విలువలు కూడా రెట్టింపు చేస్తాయి.
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ ఉంటుంది. పసుపులో విటమిన్ సి, కె, ఇ, పొటాషియం, ఐరన్, మాంగనీస్ ఉంటాయి. అలగే అల్లంలో జింజెరాల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అల్లంలో విటమిన్ సి, బి6, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. అల్లం, పసుపు కలిపి తింటే రెండు పదార్థాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.
సెల్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులు మొదలుకొని ఎలాంటి నొప్పులనైనా తగ్గించడంలో అల్లం, పసుపు ఉపయోగపడతాయి. ఈ రెండు మూలికలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం, పసుపు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం, పసుపు కలయిక అజీర్ణం, అపానవాయువు వంటి బహుళ సమస్యలను నివారిస్తుంది.
అల్లం, పసుపు రసాన్ని కలిపి తింటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో పని చేస్తాయి. అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఈ రెండు మూలికలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పసుపు, అల్లం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రెండు పదార్థాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ అవకాశాలను తగ్గిస్తుంది.