లైఫ్ స్టైల్

పానీపూరీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..! ఆరోగ్యం ఎలాగంటే..?

బయటతినే ఈ పానీపూరీలు ఆరోగ్యానికి మంచిది కాదని అందరూ అంటారు. అయితే వారు తయారు చేసి విధానంలో నాణ్యత లేకపోవడం వారు ఈ మాటలు అంటుంటారు. నిజానికి పానీపూరీ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పానీపూరీలో ఉండే బంగాళాదుంప, చింతపండు, ఉల్లిపాయ, చిక్పీస్ తో పాటుగా మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలే తప్ప, హానీ చేయవని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అయితే పానీపూరీ ఎంత రుచికరంగా ఉంటుందో, అందులోని కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. పానీపూరీలో ఉపయోగించే రసంలో జీలకర్రతో సహా మసాలా దినుసుల కలయిక మన జీర్ణక్రియకు మంచిది. పానీ పూరి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పానీపూరి రసాలలో మిరియాలు, అల్లం మరియు జీలకర్ర వంటి మసాలాలు ఉంటాయి. ఇవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడుతాయి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది : ఒక పానీ పూరీలో దాదాపు 36 కేలరీలు ఉంటాయి. మీరు ఆరు పానీ పూరీలను తింటే మీకు 216 కేలరీలు లభిస్తాయి, ఇవి కేవలం రెండు చపాతీలకు సమానం మరియు తద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి. పానీపూరీని కూడా అతిగా తినలేము కానీ పానీ పూరీలోని బంగాళదుంపలు ఫైబర్ యొక్క మంచి మూలం.

అవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి అంటే ఇది బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడుతుంది. వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా మారుతుంది. దీని వల్ల పెద్దలతో పాటు పిల్లలు కూడా దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వీటిని తగ్గించేందుకు మందులు వాడుతున్నారు. కానీ పానీపూరీ రసంలో పుదీనా తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *