ఆధ్యాత్మికం

పెళ్లైన ఆడవాళ్లు నల్ల దారం కట్టుకోవచ్చా..? కట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం… కంటి చూపుకి శక్తి ఉంటుంది. కొంత మంది కంటి చూపు పడితే… చెడు జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు చాలా సుకుమారంగా, కోమలంగా, అందంగా ఉంటారు. వారిపై చెడు దృష్టి పడకుండా, దిష్టి చుక్కలా… నల్లతాడు కడతారు. ఉత్తరప్రదేశ్‌లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్లు కట్టించే సంస్కృతి ప్రారంభమైందని చెబుతారు. అయితే ప్రస్తుతకాలంలో ఆడవారు, మగవారు అంటూ తేడా లేకుండా నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు.

అయితే కొంతమంది నల్ల దారాన్ని ధరించకూడదని లేదా నల్ల తాడు వారికి అశుభంగా భావిస్తారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. దీనివల్లే పెళ్లైన ఆడవారు నల్లదారాన్ని కట్టుకోవాలా? లేదా? అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఎందుకంటే వివాహిత మహిళలకు నలుపు రంగు నిషిద్ధం. పెళ్లైన ఆడవాళ్లకు నలుపు అంత మంచిది కాదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. వివాహిత మహిళలకు నలుపు రంగు అశుభంగా పరిగణించబడుతుంది.

కాబట్టి వివాహిత మహిళలు నలుపు రంగు దుస్తులను ధరించకుండా ఉండాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. నిజానికి నలుపు రంగు శనిగ్రహానికి ఇష్టమైన రంగుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో నల్ల దారాన్ని కట్టుకుంటే శనిదేవుని ఆశీస్సులు అలాగే ఉంటాయి. అంతే కాకుండా రాహు, కేతువుల ప్రభావం కూడా మీపై ఉండదు. అందుకే కొంతమంది జ్యోతిష్యులు వివాహిత స్త్రీలు ఖచ్చితంగా నలుపు దారాన్ని ధరించాలని చెబుతున్నారు.

దీని వల్ల వారి జాతకంలో శని దోషం తొలగిపోతుంది. అయితే దీన్ని కొన్ని నియమాలతో ధరించాలి. వివాహిత స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తుండటం వల్ల నలుపు దారాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి నల్లదారాన్ని కాలుకు కట్టే బదులు చేతికి కట్టుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది కాకుండా వివాహిత స్త్రీలకు శని ఆరాధన నిషిద్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *