Blog

ఉదయాన్నే మొలకలు తినడం అలవాటు చేసుకుంటే ఎంత మంచిదో తెలుసుకోండి.

మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్‌లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అయితే బరువు తగ్గడమేకాదు… మొలకలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పెసలతో తయారు చేసే మొలకలు మరింత ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొలకల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

కానీ… పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. దీనిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కి మంచి సోర్స్. తక్కువ కొవ్వు కలిి ఉంటాయి. ప్రతిరోజూ 100గ్రాముల పెసర మొలకలు తీసుకుంటే.. 30 కేలరీలు మనకు అందుతాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మొలక ల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు, ముఖ్యంగా ఫోలేట్లు, థయామిన్‌లను కలిగి ఉంటాయి. 100 గ్రాముల మూంగ్ స్ప్రౌట్స్‌లో ఎక్కువ మొత్తంలో కాపర్, ఐరన్, మాంగనీస్, పాస్పరస్, కాల్షియం, జింక్, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి.

చిక్‌పీ మొలకలు తినడం వల్ల వాటి ప్రయోజనాలను పెంచుకోవచ్చు. మొలకెత్తిన శనగల్లో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, ఫోలేట్ ,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మొలకెత్తిన బీన్స్‌లో ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి ఎసిడిటీని నివారిస్తాయి. మొలకెత్తిన కందిపప్పులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. వీటిలో విటమిన్ ఎ ఉంటుంది. కంటి ఆరోగ్యానికి , కంటి చూపును మెరుగుపరుస్తుంది. వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకుని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొలకెత్తిన శెనగలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మొలకెత్తిన శెనగలు శరీరానికి శక్తిని అందించి బరువు తగ్గడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మొలకెత్తిన బీన్స్ తినడం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *