మట్టి కుండలు లేదా సీసాల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలోని సహజమైన మార్గంలో జీవక్రియ మెరుగుపడుతుంది. వేడి వాతావరణం వల్ల జీవక్రియకు వేసవి కాలంలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. జీవక్రియను మెరుగుపరచాలంటే కుండలో నీటిని త్రాగాలి. ఫ్రిజ్ లేదంటే ప్లాస్టిక్, స్టీల్, గాజు సీసాలతో పోలిస్తే మట్టి సీసాలోని పాత్రలో ఉంచిన నీరు సహజంగా చల్లబడుతుంది. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే :మనలో చాలా మంది చల్లని నీటి కోసం ప్రిజ్ లను వాడుతూ ఉంటారు. ప్రిజ్ లోని నీటిని తాగటం వలన కొన్ని సమస్యలు వస్తాయి.
అదే కుండలో నీటిని తాగితే కొన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మట్టి కుండలోని నీటిని త్రాగితే అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. ప్రిజ్ వాడటం వలన మనకే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో ముప్పు వాటిల్లుతుంది. ఫ్రిజ్ నుంచి విడుదలయ్యే హానికారక వాయువులతో పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తాయి. ప్రిజ్ నుంచి ఉత్పత్తయ్యే హానికారక వాయువులు నేరుగా ఓజోన్ పొరపై తీరని దుష్ప్రభావాన్ని చూపుతాయి. విద్యుత్ బిల్లు పేరిట మనకు అయ్యే ఖర్చు కూడా తెలిసిందే.
వీటన్నిటికీ బోనస్ గా మన అనారోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రిజ్ వాడితే గొంతు సంబంధిత వ్యాధులు, అలర్జీ, సైనస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే మట్టి కుండలోని నీటిని త్రాగడం వల్ల శరీరానికి సమతూకమైన చల్లదనం అందడంతో పాటుగా చెమట ద్వారా కోల్పోయిన లవణాలు ఈ నీటి ద్వారా లభించి కిడ్నీ, మెదడు చురుగ్గా పనిచేసేలా సహాయపడతాయి.
సహజంగా మట్టిలో ఉండే ప్రో బ్యాక్టీరియాలు శరీరానికి లభించి అనేక యాంటీ బాడీస్ పై పోరాటం చేస్తాయి. వందల రకాల వ్యాధుల లక్షణాలను ప్రారంభ దశలోనే చంపివేసి మనల్ని నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ప్రిజ్ వాడకాన్ని సాధ్యమైనమేర పక్కనపెట్టి మట్టి కుండలను వాడాలని సలహా ఇస్తున్నారు. మన శరీరంలో 40 శాతం రోగాలకు కారణమైన నీటి విషయంలో తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద అనారోగ్య ప్రమాదాలను తప్పిస్తాయి.