ఆరోగ్యం

షుగర్ పేషెంట్స్ కూడా మామిడి పండు తినొచ్చా, తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

ఎండాకాలం కోసం ఎక్కువ మంది ఎదురుచూసేది కేవలం మామిడి పండు తినడం కోసమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే… మామిడి పండు కేవలం మనకు సమ్మర్ లో మాత్రమే దొరకుతుంది. మ్యాంగో లవర్స్.. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా..? వాటిని తిందామా అని అనుకుంటారు. అయితే… ఈ పండు తినాలనే ఇష్టం, కోరిక ఉన్నప్పటికీ… షుగర్ పేషెంట్స్ వాటిని తినలేరు. మామిడి తింటే… వారిలో షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయి. అది ప్రమాదానికి దారి తీస్తుందని భయపడతారు.

అయితే కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారు మామిడి పండ్లను తీసుకోవాలా వద్దా అన్న అనుమానాలు ఉండే ఉంటాయి. వీరిలో డయాబెటిస్‌ రోగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు మామిడి పండ్లు తింటే ప్రమాదకరమని చాలా మంది భావిస్తుంటారు. తియ్యగా ఉండే ఈ పండ్లతో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తుంటారు. అయితే షుగర్‌ బాధితులు మామిడి పండ్లను తీసుకుంటే తరచూ వారి రక్తంలో చక్కెర స్థాయిలను చెక్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ మామిడి పండ్లను తీసుకున్న తర్వాత షుగర్‌ లెవల్స్‌ అనూహ్యంగా పెరిగితే మాత్రం వాటికి దూరంగా ఉండడమే బెటర్‌ అని అంటున్నారు. అలాగే రక్తంలో షుగర్‌ ఎక్కువగా ఉన్న వారు మామిడి పండ్లను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే, పరగడుపన మామిడి పండ్లను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

మామిడి పండ్లలో షుగర్‌ స్థాయిలు ఉంటాయి అనడంలో నిజం ఉన్నా.. మామిడి పండ్లను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ కార్బోహైడ్రేట్స్​ఉంటాయని, అందుకే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగలవని డాక్టర్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *