మన సంప్రదాయం ప్రకారం వారం రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించడం సెంటిమెంట్‌గా వస్తోంది. బుధవారం వినాయకుడికి, సోమవారం శివుడికి. అలాగే. మంగళవారం హనుమాన్ మరియు లక్ష్మికి అంకితం చేయబడింది. అందుకే ఆయా రోజుల్లో ఈ దేవతలను పూజిస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అయితే ఈరోజు మంగళవారం ఇలా చేయకండి. శుక్రవారం ఇలా చేయకండి అని మనల్ని కొన్ని పనులు చేయకుండా ఆపేస్తూ ఉంటారు గ్రహాలు నక్షత్రాలు మొదలైన ఖగోళ వస్తువుల స్థానాలకి భూమి మీద జరిగే సంఘటనలకి సంబంధాన్ని సూచిస్తుంది.
ఈ శాస్త్రం ప్రకారం ఖగోళ వస్తువుల స్థానాలు జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. ఈ ప్రభావం ఆధారంగా జ్యోతిష్యులు భవిష్యత్తుని ఊహిస్తూ ఉంటారు శుభకార్యాల కోసం శుభప్రదమైన రోజులు ఎప్పుడు వస్తాయో ప్రజలకి తెలియజేస్తూ ఉంటారు హిందూ జ్యోతిష్య శాస్త్రం మీద ఆధారపడే చాలామంది ప్రజలు అనేక నమ్మకాలని పెట్టుకున్నారు. అటువంటి నమ్మకాల్లో మంగళవారానికి సంబంధించి ఒక నమ్మకం కూడా ఉంది. మంగళవారం ఆర్థిక లావాదేవులకి ముఖ్యంగా డబ్బు తీసుకోవడానికి లేదా అప్పు ఇవ్వడానికి అనువైనది కాదు.
మీ పెద్దలు మంగళవారం ఈరోజు డబ్బులు తీసుకోకండి డబ్బులు ఇవ్వకండి అని చెప్పడాన్ని మీరు చాలా సార్లు వినే ఉంటారు. మంగళవారానికి సంఘర్షణ దూకుడు సూచించే అంగారక గ్రహంతో అనుబంధం ఉంది మంగళవారం నాడు ఆర్థిక పనులు చేస్తే ప్రతికూల ప్రభావాలు చూడాల్సి ఉంటుంది. అందుకనే అప్పు తీసుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ మంచిది కాదు దీని వలన కలహాలు తలెత్తచ్చు లేదంటే ఆర్థిక నష్టం కలగొచ్చు. ముఖ్యంగా మనం ఇచ్చిన అప్పు ఇతరుల నుండి తిరిగి పొందలేకపోవచ్చు ఇతర నష్టానికి సైతం అవకాశం ఉంటుంది మంగళవారం జరిపిన లావాదేవీల్లో జాప్యం ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.
ఆర్థికముగా మాత్రమే ప్రభావితం చేయడమే కాదు ఇతర రంగాల్లో కూడా మీపై ప్రభావం పడుతుంది. మంగళవారం కుటుంబ సభ్యుల నుండి అప్పు తీసుకుంటే మనస్పర్ధలు వస్తాయి జీవిత భాగస్వామి లేదా తోబుట్టువులు నుండి చిన్న వస్తువుల్ని కూడా తీసుకోకూడదని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఋణ సంక్షోభంలో పడే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి తప్పులు చేయకండి.