ఎంటర్టైన్మెంట్

మహేష్ బాబు వాడే లగ్జరీ బ్యాగ్ చూశారా..? ఆ బ్యాగ్ ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.?

టాలీవుడ్ లో మహేష్ బాబు సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నారు. ఆయన ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. దీని కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను దాదాపు కంప్లీట్ చేశాడు జక్కన్న. అయితే సూపర్ స్టార్ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఎంపికలపై ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్స్. ఎప్పుడూ క్యాజువల్ అండ్ స్టైలీష్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు మహేష్.

మహేష్ షూస్ నుంచి డ్రెస్సింగ్, గ్లాసెస్, వాచ్ ఇలా ప్రతిదీ ఎంతో స్టైలీష్ గ్రాండ్ గా కనిపిస్తుంది. గతంలో వెకేషన్ కు వెళ్తూ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎంఎం బ్యాగ్ ధరించాడు. ఆ సొగసైన నలుపు, నీలం రంగు బ్యాగ్ సిగ్నేచర్ LV మోగ్రామ్ తో అలకరించబడింది. ఈ బ్యాగ్ హై ఎండ్ ఫ్యాషన్ లుక్. అయితే సెలబ్రెటీస్ అవుట్ ఫిట్ డీకోడ్ ఇన్ స్టా పేజీ ప్రకారం ఆ లూయిస్ విట్టా బ్యాగ్ ధర అక్షరాల రూ.3.92 లక్షలు.

ఇప్పుడు ఈ బ్యాగ్ ధర తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమా ఆస్ట్రేలియా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంటుంది.

ఇందులో మహేష్ సరసన హాలీవుడ్ ముద్దుగుమ్మలు నటిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత జాన్వీ కపూర్, అలియా భట్ పేర్లు వినిపించాయి. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *