తాజా వార్తలు

లోన్ తీసుకున్న వారు చనిపోతే డబ్బులు తిరిగి కట్టక్కర్లేదు. ఇంకా వల్లే మీకు డబ్బులు ఇస్తారు.

డబ్బుతో ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుంతో చెప్పలేం. చేతిలో డబ్బులు లేనప్పుడు ఏదైనా అత్యవసరం ఏర్పాడితే అప్పుడు ఇతరుల నుంచి అప్పు తీసుకోవాలి. లేదంలే బ్యాంక్ నుంచి లోన్ పొందాలి. బ్యాంకులు కొంత వడ్డీ రేటుకు రుణాన్ని అందిస్తాయి. బ్యాంక్ లోన్ తీసుకున్న వారు నిర్ణీత గడువులోగా దాన్ని తిరిగా చెల్లించాలి. అయితే మహిళలకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం అదిరే తీపికబురు అందించింది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రేవంత్ సర్కార్ తీపికబురు తీసుకువచ్చింది. ఆపన్న హస్తం అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది.

డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉండి లోన్ తీసుకున్న మహిళ ఏదైనా కారణంతో చనిపోతే.. ఆ లోన్ మొత్తం మాఫీ అయ్యేలా వారి పేరిట బీమా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలపై భారం పడకుండా ఈ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ బీమా ప్రయోజనాలను ఈ ఏడాది మార్చి 14 నుంచే అమలులోకి వచ్చేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కేవలం డ్వాక్రా రుణాలకు మాత్రమే కాకుండా స్త్రీనిధి లోన్లకు కూడా ఈ లోన్ బీమా వర్తించనుంది. కాగా క్షేత్ర స్థాయిలో బీమా క్లెయిమ్ చేసే విధానంపై ఇప్పటికే సెర్ప్, మెప్మా సిబ్బందికి గైడ్ లైన్స్ కూడా అందాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లోన్ బీమా వర్తించనుంది. దీని వల్ల చాలా కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రుణాలు తీసుకున్న మహిళలు ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు.. వారి వాటా ధనం చెల్లించడం సమస్యగా మారుతోంది. కాగా గ్రూపుగా తీసుకున్న లోన్ ను గ్రూపుగానే చెల్లించాల్సి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. మృతురాలి కుటుంబ సభ్యులు లోన్ కిస్తీ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో గ్రూపులోని మిగతా సభ్యులపై ఆ భారం పడుతోంది.

ఇలా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లోన్ తీసుకున్న మహిళలు ఎవరైనా ఏ కారణంతో చనిపోయినా వారు తీసుకున్న లోన్ రూ.2 లక్షల వరకు మాఫీ అవుతుంది. చనిపోయిన మహిళ బ్యాంకు లింకేజీ రుణం, స్త్రీ నిధి లోన్ రెండూ తీసుకుని ఉంటే మాత్రం ఒక లోన్ మాత్రమే మాఫీ కానుంది. అంతేకాకుండా ప్రమాదవశాత్తూ మహిళా గ్రూపు సభ్యురాలు చనిపోతే యాక్సిడెంటల్ బీమా కింద రూ.10 లక్షలు మృతురాలి కుటుంబానికి చెల్లించనున్నారు. ఇలా రేవంత్ సర్కార్ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉచిత బస్ ప్రయాణం కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *