ఎంటర్టైన్మెంట్

పేదలకు ఉచితంగా ఫుడ్ ప్యాకెట్స్ పంచిన కాజల్ ఫ్యాన్స్, వీడియో చూసి కాజల్ ఎమోషనల్.

కాజల్..2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. అయితే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం తన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది.

పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కొందరు అభిమానులు మాత్రం పంచదార బొమ్మకు జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దీనిని చూసి కాజల్ కూడా ఎమోషనల్ అయ్యింది. ఇంతకీ మన పంచదార బొమ్మ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసుకుందాం రండి. సాధారణంగా హీరోల పుట్టిన రోజును అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. పెద్ద ఎత్తున కేక్ కటింగులు, పాలాభిషేకాలు చేస్తారు. మరికొందరు అన్నదానం, రక్త దాన శిబిరాలు నిర్వహిస్తారు.

అయితే హీరోయిన్ల పుట్టిన రోజులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదు. కానీ కాజల్ అభిమానులు మాత్రం ఒక మంచి పని చేశారు. తమ అభిమాన హీరోయిన్ బర్త్ డే ను పురస్కరించుకుని సుమారు 150 మంది పేద పిల్లలకు భోజనాలు పంపిణీ చేశారు. అంతేకాదు ఈ నెలాఖరులోపు 50 మొక్కలను నాటు తామని మాటిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది కాస్తా వైరలైంది. ఇక ఈ వీడియో చూసిన కాజల్ కూడా భావోద్వేగానికి లోనైంది. ‘సమాజం పట్ల మీ ఆలోచన, దయ నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మీరు నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసింది. అలాగే పేద పిల్లలకు ఫుడ్ పంపిణీ వీడియోను కూడా షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన వారందరూ కాజల్ అభిమానులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేసే బదులు అభిమానులు ఇలాంటి మంచి పనులు చేయాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *