జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని తరచుగా చెబుతుంటారు. జీడిపప్పు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. వేసవిలో జీడిపప్పు తినాలా వద్దా అనే ప్రశ్న ఇప్పుడు చాలామందిలో తలెత్తుతుంది. అందుకునే వేసవిలో జీడిపప్పును ఎక్కువగా తినకూడద్దు. అయితే ఈ రోజుల్లో మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు ప్రతి ఇంట్లో సర్వసాధారణం. వీటిని నియంత్రించలేకపోతే శరీరంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తాయి. సిరలు, ధమనులలో రక్తం గడ్డకట్టడానికి దారి తీసేలా చేస్తుంది. ఫలితంగా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
మరోవైపు మధుమేహం పెరిగితే కంటి, గుండె, కిడ్నీ సమస్యలు రావచ్చు. మధుమేహం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. అన్నం, స్వీట్స్ లాంటివి ఎక్కువగా తినడం మానేయడంతోపాటు కొన్ని ముఖ్యమైన ఆహారాలు తప్పక తీసుకోవాలి. ఇవి మధుమేహం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో జీడిపప్పు ఒకటి. జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, జింక్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ కొన్ని జీడిపప్పులు తినడం వల్ల శరీరానికి కావల్సినంత పోషకాలు అందుతాయి.

అయితే ప్రతి ఒక్కరూ జీడిపప్పు తినొచ్చా, ప్రతిరోజూ జీడిపప్పు తినడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. జీడిపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది నిజం కాదు. పరిమిత పరిమాణంలో జీడిపప్పు తినడం ఆరోగ్యానికి హాని కలిగించదు. ప్రముఖ వైద్యుల అభిప్రాయం ప్రకారం.. పరిమిత పరిమాణంలో జీడిపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ నెయ్యితో వేయించిన జీడిపప్పుకు మాత్రం దూరంగా ఉండాలి.
ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. జీడిపప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. కేలరీలు కూడా పెరుగుతాయి. ఎక్కువ కేలరీలు శరీర బరువును పెంచుతాయని చాలా మంది నమ్ముతారు. కానీ, పరిమిత పరిమాణంలో జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బలహీనంగా ఉండే వారికి జీడిపప్పు చాలా మేలు చేస్తుంది. రోజూ కనీసం 3-4 జీడిపప్పు తినాలి. ఫలితంగా శరీరం చురుకుగా ఉంటుంది. పిల్లలకు కూడా వీటిని ఇవ్వవచ్చు.