నివేదాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషలో కూడా పలు సినిమాలలో నటించి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ. అయితే టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇందులో నివేదా కారును చెక్ చేయడానికి పోలీసులు తనను ఆపగా.. తను పోలీసులతో వాగ్వాదానికి దిగుతుంది.
అయితే ఇదంతా చూసిన నెటిజన్లు మాత్రం ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్ చేస్తున్నారు? పోలీసులు యూనిఫాం వేసుకుని క్రాక్స్ చెప్పులు వేసుకోవడం ఏంటి? అని సెటైర్లు వేస్తున్నారు. ఇంటర్నెట్‌లో తనపై వైరల్ అవుతున్న వీడియో గురించి నివేదా పేతురాజ్.. ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వైరల్ అవుతున్న వీడియోలో నివేదా పేతురాజ్ కారును ఆపిన పోలీసులు.. ట్రంక్ ఓపెన్ చేయమని అడుగుతారు.
‘‘రోడ్ వరకు వెళ్తున్నాను. పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి’’ అంటూ పోలీసులు చెప్పిన మాట వినకుండా వారిని డైవర్ట్ చేస్తుంది నివేదా. అయినా సరే పోలీసులు ప్రోటోకాల్ పాటించాలని, డిక్కీ ఓపెన్ చేయండి అంటూ అడుగుతారు. అందులో ఏం లేదని, ఓపెన్ చేయలేనని నివేదా చెప్తుంది. దీంతో విషయం పెద్దగా అవుతుంది.
‘‘ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. నేను ట్రంక్ ఓపెన్ చేయలేను’’ అని చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తుంది. ఇంతలో ఇదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తిని గమనించి తన ఫోన్‌ను పక్కకు తిప్పేస్తుంది నివేదా.