ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ‘వినాయక చవితి’ లేదా ‘ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను
చవితి రోజున చంద్రుణ్ణి చూడడం దోషం, చవితి చంద్రుడు ఈ రోజునుండే ఆకాశంలో విహరిస్తాడు.
ఎవరైనా చెంద్రుడిని పొరపాటున చూసినచో ఈ మంత్రం జపము చేయడం చాలా మంచిది.
సింహః ప్రసేన మవదీత్,
సింహో జాంబవంతాహతః,
సుకుమారక మారోధి,
స్తవహ్యేశ స్యమంతకః
పూజకు కావాల్సినవి
శ్రీ వరసిద్ది వినాయక పూజకు కావలసిన వస్తువులు,పూజా విధానము.
వినాయకవ్రతకు:
పసుపు 25 గ్రా.
కుంకుమ 25 గ్రా.
పసుపు గణపతి
మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టం
బియ్యం అరకిలో
తమలపాకులు 20
అగరవత్తులు 1 పేకట్
ప్రత్తి (ఒత్తులకు, వస్త్రయుగ్మమునకు,యజ్ణోపవీతమునకు)
దీపము ( కొబ్బర నూనెతో శ్రేష్టం,ఆవునేతితోగాని)
పంచామృతములు (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు, అరపలు, బెల్లం 100 గ్రా, కొబ్బరికాయ
హరతి కర్పూరం
పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము :- వినాయక ప్రతిమ మట్టిదే వాడవలెనా? రంగుది వాడవలనా ? అనే సందేహానికి గణేశ పురాణంలో సమాధానం కలదు.
శ్లో :- పార్థివి పూజితమామూర్తి స్థైవావా పురుషాన్వా ఏకదడతి సా కామ్యం ధన పుత్రం పశునపీ
పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించినచో ధన, పుత్రు, పశ్వాది అన్నీ సంపదలను పొందవచ్చు.
ఆ ప్రతిమ ఎటిమతో చేయవలెను?
” మృత్తికాంశం సుందరమ్ స్నిగ్ధాం సంచలనం పాషాణ వర్జితాం “
శుభ్రం చేసిది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చమైన నీటితో తడిపి ప్రతిమచేయవలెను
శ్లో లో . చంద్రశేఖ్ విరాజితాం
నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను సవ్యముగా చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యమని కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసిన ఇచ్చులు వినాయకచవితి ముందురోజు నుండే పెడుతున్నారు. ప్రతిమ అన్నిటికన్నా మంచిదని గణేశ పురాణము బట్టి గ్రహించవలెను.
దూర్వాయుగ్మ పూజ :
వినాయకునికి ఎక్కువ ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వులు అనగా గరక పోచలు. గ్యాస్ అనగా గడ్డి ప్రతిచోట ఉండును. చిగురులు కల గరిక పోచలు వినాయకుడు పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ కలిగినవి. గణేశుడే స్వయంగా ” మత్పూజా భక్తినిర్మితా మహీత స్వల్పకవాపీ వృధా దూర్వంకురై ర్వినా ” అంటే భక్తితో చేసిన పూజ గొప్పది.గరిక లేకుండా పూజ చేయరాదు.
” వినా దూర్వాంకు రై : పూజా ఫలంకేనాపి నాప్యతే
తస్మాదిషసి మద్భ త్వరిత రేఖా
భక్తీ సమర్పితా దూర్వా దతతీ యత్ఫలం మహత్
నతత్క్ర్ తుశతై రాదా నైర్ ర్వ్ ఉష్టానా సంచయై : “