ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఓ రేంజ్ లో దంచి కొడుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31న బీహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని.. అలాగే వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే రుతుపవనాల రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. రోహిణి కార్తె ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే రకమైన వాతవరణం ఉంటుందని ఐఎండి అంచనా వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం అల్లూరి జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు, 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. కూనవరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. శుక్రవారం ఏపీలో 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
విజయ నగరం జిల్లాలో 3, పార్వతీపురంమన్యంలో 3, అల్లూరిలో 3, ఏలూరులో 2, కృష్ణా 4, ఎన్టీఆర్ 13, గుంటూరులో 17, బాపట్ల14, పల్నాడు 28, ప్రకాశం 27, నెల్లూరు 18, నంద్యాల 1, అనంతపురం 5, సత్యసాయి2, వైయస్ఆర్ 4, అన్నమయ్య జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం ప్రకాశం జిల్లా పామూరులో 44.8° డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం,
పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7° డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 44.6°డిగ్రీలు, కృష్ణా జిల్లా కోడూరులో 44.5° డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 44.4°డిగ్రీలు, అల్లూరి జిల్లా కూనవరంలో 44.3° డిగ్రీలు, గుంటూరు జిల్లా తుళ్లూరులో 44.1° డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు.అల్లూరి జిల్లా నెల్లిపాకలో 46.2డిగ్రీలు, చింతూరులో 45.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం కూనవరంలో 46.5డిగ్రీలు, రావికమతంలో 42.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.