ఎలక్టోరల్ ఇంకు లేదా ఓటర్ ఇంకు లేదా ఎలక్షన్ ఇంకు అని పిలుస్తారు. దీన్ని అలా ఉండడం కోసం ఇందులో సిల్వర్ నైట్రేట్ ని కలుపుతారు. ఈ సిల్వర్ నైట్రేట్ కలిపిన ఇంకు వేలిని తాకగానే మరకలా అంటుకుపోతుంది. అయితే దేశంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఎన్నికల సంఘం చాలా సమస్యలు ఎదుర్కొంది. వాటిలో ముఖ్యమైనది దొంగ ఓట్లు. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ మళ్లీ వస్తుండటంతో వావటిని ఎలా అడ్డుకోవాలో తెలియక ఎన్నికల అధికారులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత సుదీర్ఘ మేదో మథనం తర్వాత చేతి వేలిపై చెరిగిపోని సిరా గుర్తు వేయాలనే ఆలోచన వచ్చింది. అదే బ్లూ ఇంక్ పద్దతి. దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ బ్లూ ఇంక్ పద్ధతిని దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తున్నది.
1962 ఎన్నికల్లో తొలిసారిగా ఈ చెరగని సిరాను ఉపయోగించారు. సుకుమార్ సేన్ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు. అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ సిరాను వాడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో రూ.33 కోట్ల ఖర్చుతో 26 లక్షల వయల్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించింది. అయితే ఈసారి 26.55 లక్షల వయల్స్‌ను ఆర్డర్ చేసింది. దీనికోసం రూ.55 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఎన్నికల సంఘం ఆర్డర్ చేసిన వయల్స్ ఒక్కో దాంట్లో 10 మిల్లీ లీటర్ల సిరా ఉంటుంది. ఒక్క సీసాతో దాదాపు 700 మంది ఓటర్ల వేళ్లపై సిరా గుర్తు వేయవచ్చు.
ఓటు వేసిన వారి చూపుడు వేలిపై రాసే ఈ స్పెషల్ ఇంక్‌ను భారత ఎన్నికల సంఘం మాత్రమే తయారు చేయిస్తుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL ) అనే సంస్థ ఒక్కటే ఈ ఇండెలబుల్ ఇంక్‌ను తయారు చేస్తుంది. దీని తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంచుతారు. ఎంపీవీఎల్ డైరెక్టర్లకు కూడా ఈ ఫార్ములా తెలియదు. కేవలం సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు మాత్రమే ఈ ఇంక్ తయారీ విధానం తెలుసు. రిటైర్మెంట్ లేదా అనుకోని కారణాలు ఏర్పడినప్పుడు మాత్రమే.. నమ్మకస్తులైన తర్వాతి ఉద్యోగులకు ఈ ఫార్ములాను బదిలీ చేస్తారు.
ఈ సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్ ఈ సిరాను ప్రకృతిలో ఫొటోసెన్సిటివ్గా చేస్తుంది. దీని కారణంగా సూర్మరశ్మి తాకినప్పుడు ఈ సిరా ముదురు రంగులోకి మాత్రమే మారుతుంది. ఈ సిరా వేలిపై పూసినప్పుడు గోధుమ రంగులో ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయానికి ముదురు ఊదా రంగులోకి.. ఆపై నల్లగా మారుతుంది. కాగా, ఈ సిరాలో వాడే సిల్వర్ నైట్రేట్.. మన శరీరంలోని ఉప్పుతో కలిసినప్పుడు అది సిల్వర్ క్లోరైడ్‌గా తయారవుతుంది. ఇది చర్మానికి అతుక్కుని ఉంటుంది. నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా తొలగించలేకుండా తయారవుతుంది. చర్మ కణాలు పాతబడి.. మృతకణాలు ఒక్కొక్కటిగా రాలిపోయినప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృశ్యమవుతుంది.