ఆయుర్వేదం

గన్నేరు పువ్వు తింటే నిజంగానే చనిపోతారా..? అసలు విషయం తెలిస్తే..?

రంగు రంగుల గన్నేరు పూల చెట్లు ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ పూజకి తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు. వాటిలో పారిజాతం, గన్నేరు పూలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు పూల చెట్లు ఎటువంటి ప్రదేశంలోనైనా పెరుగుతాయి. అయితే గన్నేరు పువ్వు, కాయలు విషంతో సమానం అని తెలిసిందే. తెలీక ఆ వ్యక్తి వాటిని తినడంతో ప్రాణాలు కోల్పోయాడట. అందుకే.. అక్కడ గుడి పరిసరాల్లోనూ ఆ మొక్కలు ఉండటానికి వీలు లేదని, ఆ పూలను గుడిలోకి తేవద్దని నిర్ణయించారు.

గన్నేరు మొక్కను చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో , రోడ్ల పక్కన పెంచుతారు. దీనికి ప్రధాన కారణం ఈ మొక్కలో గాలిని శుద్ధి చేసే గుణాలు ఉండడమే. ఈ మొక్క గాలిలోని కాలుష్య కారకాలను ఫిల్టర్ చేసి మనకు స్వచ్ఛమైన గాలిని పంపుతుంది. అదేవిధంగా గన్నేరు మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. అవి ఎరుపు, పసుపు , తెలుపు. అయితే వీటిలో పసుపు రంగులో ఉండే గన్నేరు పువ్వు అత్యంత విషపూరితమైనది. గన్నేరు పూలను ఎక్కువగా దేవాలయాల్లో పూజకు మాత్రమే ఉపయోగిస్తారు.

ఇది కూడా ఎక్కువగా శివాలయాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. దేవాలయాల్లో ఈ పువ్వును ప్రసాదంగా ఇస్తారు కాబట్టి ఆ సమయంలో తప్ప ఇతర సందర్భాల్లో మహిళలు ఈ పువ్వును పెట్టరు. అలాగే, దేవాలయాలలో తిరునీరు, కుంకుము , పొంగల్ నైవేద్యంలో ఇతర పుష్పాలతో పాటు ఈ పువ్వును కలుపుతారు. గన్నేరు పువ్వును ఆయుర్వేద వైద్యంలో అనేక విధాలుగా ఔషధంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఇది చర్మ సంబంధిత సమస్యలు , మరిన్నింటికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

గన్నేరు పువ్వులోని పసుపు రంగు మాత్రమే విషపూరితమైనది, కానీ ఏ గన్నేరు మొక్క అయినా.. ఆకులు, కాయలు మాత్రం విషపూరితమే. అందుకే వాటిని పొరపాటున కూడా నోట్లో పెట్టుకోకూడదు. గన్నేరు కాయలను తింటే వెంటనే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అంటే గుండె నొప్పి వస్తుంది అన్నమాట. ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. కొందరికి మొదట వాంతులు, విరోచనాలు, మూర్ఛ, చర్మంపై దద్దుర్లు లాంటి వాటితో మొదలై… చివరకు గుండె నొప్పి వచ్చేదాకా దారితీస్తుంది. కాబట్టి.. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *