లైఫ్ స్టైల్

ఈ గింజ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే వ‌ద‌లొద్దు. వీటి లాభాలు తెలిస్తే..?

శ‌త‌పుష్టి మొక్క నుండి ఈ గింజ‌లు మ‌న‌కు ల‌భిస్తాయి. ఆన్ లైన్ లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో ఇవి మ‌న‌కు సుల‌భంగా ల‌భిస్తాయి. ఈ దిల్ సీడ్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో నువ్వుల కంటే ఎక్కువ‌గా క్యాల్షియం ఉంటుంది. అయితే డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో రకాలు వచ్చాయి. ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ అంటే జీడి పప్పు, బాదం పప్పు, కిస్ మిస్ మాత్రమే. కానీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌లో చాలా రకాలు వచ్చాయి.

వాటిల్లో ఈ దిల్ సీడ్స్ కూడా ఒకటి. మనం ఆహారంగా తీసుకోదగిన వాటిల్లో దిల్ సీడ్స్ కూడా ఒకటి. అవేనండి శతపుష్టి గింజలు. ఈ గింజలు ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి. ఎందుకంటే ఈ దిల్ సీడ్స్ లో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. చూడటానికి జీలకర్ర మాదిరి ఉంటాయి. వీటిని వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. పోపు వంటి వాటిల్లో జీలకర్ర మాదిరి వాడవచ్చు. వీటితో లడ్డూలు కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇతర ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించి తీసుకోవచ్చు.

ఈ గింజలు వాడటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, బలంగా, గుల్ల బారగుండా ఉంటాయి. భవిష్యత్తులో ఎముకలకు సంబంధించిన సమస్యలను రాకుండా చేస్తుంది. ఈ గింజలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ప్రేగుల్లో, పొట్టలో మలినాలను, విష పదార్థాలను బయటకు పంపుతుంది. జీర్ణ శక్తిని పెంచి, మలబద్ధకం సమస్యను తీరుస్తుంది.

డయేరియా, కామెర్లు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. గుండెకు కూడా చాలా మంచిది. అదే విధంగా క్యాన్సర్ నివారణకు కూడా ఈ దిల్ సీడ్స్ ఎంతో చక్కగా ఉపయోగ పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి తీసుకుంటే బీపీని కంట్రోల్ చేయవచ్చు. రక్త హీనత సమస్య తగ్గుతుంది. మతి మరుపు కూడా దూరం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *