ఢిల్లీ మెట్రో కోచ్‌లలో ఇలాంటి వీడియో చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనిపై డిఎంఆర్‌సీ ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. గత నెలలో మెట్రోలో వీడియోల రికార్డింగ్‌ను నిషేధించింది. మెట్రోలో ప్రయాణించండి.. కానీ న్యూసెన్స్ సృష్టించకండి అంటూ ట్వీట్ చేసింది.అయినా ఫలితం లేకపోయింది.
అయితే ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేసి వార్తల్లోకెక్కింది. అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది. వీడియోలోని మహిళ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మనిషా డాన్సర్‌గా గుర్తించారు. ఈ వీడియోని ఆమె అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మెట్రోలో ఇలాంటి వీడియోలు ఇంతకు ముందు కూడా వచ్చాయి. గత నెలలో వైరల్ అయిన ఒక వీడియోలో ఇద్దరు మహిళల మధ్య బహుశా సీటు విషయంలో వాదన జరిగింది. ఈ చర్చ ఎంతగా పెరిగిపోయిందంటే అది శారీరక హింసకు కూడా దారితీసింది. వాగ్వాదం సమయంలో ఒకరు మరొకరిని నెట్టుకున్నారు.
తలపై కొట్టుకోవడం,కాళ్లతో తన్నుకుంటూ నానా రచ్చ చేశారు.. వీడియోలో విచిత్రం ఏంటంటే.. పక్కనే నిలబడిన జనం వారిద్దరినీ ఆపడానికి ప్రయత్నించకపోగా, అందరూ తమ సెల్‌ఫోన్లతో వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.