సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే పోషకాహారంతో పాటు రోజూ తగినంత నీళ్లు తాగడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది, పోషకాలు శరీరంలో కదులుతాయి, వ్యర్థాలు తొలగిపోతాయి. నిపుణులు రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు లేదా 250 మిల్లీలీటర్ల చొప్పున మొత్తం ఎనిమిది గ్లాసులు తాగాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఎలాంటి సమస్య లేకుండా మీకు తలనొప్పి వస్తే మీ శరీరంలో నీరు తక్కువ ఉందని అనుకోవాలట. శరీరం డీహ్రైడేషన్‌కు గురైనప్పుడు మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ లభించదు కాబట్టి తలనొప్పి వస్తుంటుదట.
అయితే డీహైడ్రేషన్‌కు గురైన సమయంలో ఆకలి ఎక్కువగా అవుతుంటుంది. ఇలా అయితే తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. నోటి నుంచి దుర్వాసన ఎక్కువ కాలంగా వస్తుంటే కూడా మీరు తగినంత నీరు తీసుకోవడం లేదని నిర్ధారించుకోవాలట. తక్కువ నీరు తాగడం వల్ల గొంతు పొడి బారుతుంటుంది. దీని వల్ల నోటి లోపల బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. దీని వల్ల నోటి దుర్వాసన ఎక్కువ అవుతుంది.
శరీరం డీహైడ్రేషనకు గురైన సమయంలో శరీరంలో ప్లాస్మా కౌంట్ తక్కువ అవుతుంది అంటున్నారు నిపుణులు. రక్త ప్రవాహం కూడా పెరుగుతుంది. దీని కారణంగా గుండె కొట్టుకోవడం వంటి సమస్యలు పెరుగుతాయి. చర్మం పొడిబారే సమస్య కూడా శరీరంలో నీటి కొరత వల్లే వస్తుందట. చర్మంపై గీతలు, ముడతలు పడడం కూడా జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు డీహైడ్రేషన్‌తో బాధ పడుతున్నట్టు.
అంతేకాదు ఎంత ఆహారం తీసుకున్నా నీరసంగా ఉంటున్నారంటే కూడా మీ శరీరంలో తగినంత నీరు లేదు అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు డీహైడ్రేషన్ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందట. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం అవదు. పేగు కదలికలు సరిగ్గా ఉండక మల బద్ధకం సమస్య వస్తుంది. మరి ఇన్ని సమస్యలకు కారణం అయ్యే నీరును తీసుకోవడం బెటరే కదా. అతిగా నీరు తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి అంటారు నిపుణులు. కాస్త జాగ్రత్త సుమ.