ఈ చింతకాయ పచ్చిగా ఉన్నప్పుడు తింటే వగరుగా ఉంటుంది. పక్వానికి వచ్చాక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది దక్షిణ మెక్సికో, దక్షిణ అమెరికా మధ్య అమెరికాలకు చెందినది. అయితే, తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ సీమ చింతకాయ సత్తా తెలిస్తే మాత్రం మీరు తినకుండా ఉండలేరంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే సీమచింతతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
విటమిన్-సి సమృద్ధిగా ఉన్నందువల్ల సీమ చింతకాయ తింటే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇందులో విటమిన్, ఎ, బి, సిలతో పాటు మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా వుంటాయి. సీమ చింతలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్- సి, ఎ, పొటాషియం, ఐరన్ లాంటి అనేకానేక విటమిన్లు, మినరల్స్ ఇందులో ఉన్నాయి. ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మలబద్ధకాన్ని నివారిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో వున్నాయి. బరువు తగ్గాలనుకునేవారికి చీమచింతకాయలు మంచి ఆహారం అంటున్నారు. చీమచింతలో క్యాల్షియం నిల్వలున్న కారణంగా ఎముక బలానికి ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడితో బాధపడేవారికి చీమ చింతకాయలు ఔషధంలా పనిచేస్తాయి. మోతాదుకి మించి వీటిని తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. సీమ చింతకాయలో విటమిన్-ఎ ఉంటుంది.
దీంతో కంటిచూపు మెరుగ్గా ఉండేలా చూస్తుంది. కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. అలా బరువు తగ్గాలనుకునేవారికి సీమచింత మంచి ప్రత్యామ్నాయం. గర్భిణీలు, బాలింతలు వీటిని తినకుండా వుండటమే మంచిదని చెబుతున్నారు.