ఆరోగ్యం

ఈ పండ్లు తరచూ తింటుంటే చాలు, మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యిపోతుంది.

విపరీతంగా నూనె వాడకం, వేపుడు పదార్థాలను తినడం, కూల్ డ్రింక్స్, వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోతుందని, ఫలితంగా ఒబేసిటీ బారినపడి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఊబకాయం వస్తుంది, ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. కండరాల నొప్పులు, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే ఈ పండ్లను తింటే మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యిపోతుంది.. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా కొన్ని ఆహారాలను తీసుకోవాలి. ఈరోజు ఏ పండ్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందో చూద్దాం. ద్రాక్ష కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అని అంటుంటారు.

యాపిల్ లో ఉండే పెక్టిన్ అనే సమ్మేళనం శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయ. పడుతుంది. అలాగే ఫైబర్ జీవక్రియ మెరుగుదలకు సహాయపడుతుంది. మంచి రుచితో ఉండే స్ట్రాబెర్రీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడే రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అవకాడో కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఒకప్పుడు ఈ పండు చాలా తక్కువగా లభించేది.

కానీ ఇప్పుడు super మార్కెట్స్, ఫ్రూట్స్ షాప్ లలో విరివిగా లభిస్తున్నాయి. వీటిలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే శరీరానికి అవసరమైన మంచి కొవ్వును అందిస్తుంది. ఈ పండ్లతో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉన్న పండ్లను కూడా తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *