లైఫ్ స్టైల్

రక్తదానం చేస్తూ బ్లడ్ బ్యాంకు ద్వారా స్ఫూర్తిని పంచే వీడియో షేర్ చేసిన చిరంజీవి.

చిరుపై అభిమానంతో రక్తదానం చేస్తూ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతున్నారు. 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ప్రారంభం కాగా.. తొలుత రక్తం ఇచ్చిన వ్యక్తి మురళీ మోహన్, రెండో వ్యక్తి నటుడు మహర్షి రాఘవ.. అప్పటి నుంచి మహర్షి రాఘవ వరుసగా రక్త దానం చేస్తూ వస్తున్నారు. అయితే ఇక అక్కడ చిరంజీవి అభిమాని అని చెప్పుకునే ప్రతి ఒక్కరు పదుల సంఖ్యలో బ్లడ్ ఇచ్చి చాలామందిని కాపాడుతూ వస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చిన బ్లడ్ తో చాలామంది ప్రాణాలను నిలబెట్టుకున్నారు.

ఇక ఈరోజు “వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే” సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో యువకులు ఎక్కువ సంఖ్యలో బ్లడ్ ఇచ్చి చిరంజీవి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటూనే, సాటి మానవులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యం తో ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమం లో వాళ్ళు కూడా ఒక భాగం అయినందుకు మురిసిపోతున్నారు. నిజానికి చిరంజీవి చేపట్టిన ఈ గొప్ప పని అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇక ఇప్పటికి చాలా మంది యూత్ బ్లడ్ ఇస్తు ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారు.

ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించినందుకు గాను ఆయనకు ఇప్పటివరకు చాలా అవార్డులు కూడా వచ్చాయి. పది లక్షల యూనిట్ లను మించి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని సేకరించారు. ఇక ఇప్పటివరకు యాక్సిడెంట్ అయిన యువకులకు కానీ, డెలివరీ లేడీస్ కి అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారందరికీ కూడా తన బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు అయితే అందుతున్నాయి.

ఇక చిరంజీవి హీరో గా తను సినిమాలు చేసుకుంటూ ఉండచ్చు కానీ తనను అంతటి వారిని చేసిన జనానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశ్యం తోనే తను బ్లడ్ బ్యాంక్ ను స్థాపించానని చిరంజీవి చాలా సార్లు చెప్పాడు. నిజానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించిన తర్వాతే చాలామంది యూత్ బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంతకుముందు ఎవరూ కూడా బ్లడ్ ఇచ్చే వాళ్ళు కాదు… ఒకరకంగా ఆయనే అందరిని మోటివేట్ చేశాడనే చెప్పాలి…ఒక ఇవాళ్ళ వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే కావడం వల్ల చిరంజీవి బ్లడ్ ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలను కూడా తెలియజేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *