ఆధ్యాత్మికం

హిందువులు తినడానికి ముందు ప్లేట్ చుట్టూ నీళ్లు ఎందుకు చల్లుతారో తెలుసా..! అసలు రహస్యం ఇదే.

మనం తినే ప్లేటు చుట్టూ నీళ్లు చల్లడం అనే ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మంది ఇలా చేయడం ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మనం తినే ప్రదేశంలో ప్రతికూలతలు ప్రవేశించకుండా ప్లేట్ చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది. ఇంకో కారణం కూడా ఉంది.. తినడానికి ముందు ప్లేట్ చుట్టూ నీరు చల్లడం వల్ల అన్నపూర్ణ దేవికి, ఇష్ట దైవానికి గౌరవంగా ఈ పనిని చేస్తారు. ఇలా చేయడం వల్ల వారికి ఇచ్చినట్టు భావిస్తారు.కొంతమంది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయడానికి తినే ఆహారం చుట్టూ నీళ్లు చల్లుతారు. దేవుడి ఆశీర్వాదాల కోసం మంత్రాలు చదువుతూ నీళ్లు చిలకరిస్తారు.

అయితే ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, దాని వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు ఇవే.. ఈ ఆచారం చాలా పురాతనమైనది. చాలా కాలం పాటు అడవుల్లో నివసించిన రుషులు, మునులు దీన్ని ప్రారంభించారు. వారి కాలంలో కాంక్రీట్ ఫ్లోర్స్‌ ఉండేవి కావు. చాలా మంది నేలమీద కూర్చొని, అరటాకులపై ఆహారాలు పెట్టుకుని భోజనం చేసేవారు. ఆ సమయంలో నేల పొడిగా ఉంటే, దానిపై ఎవరైనా నడిస్తే ధూళి లేచి అరటాకుపై పడేది. ఆహారంలో దుమ్ము, ధూళి పడి అది మురికి అయ్యేది.

అందుకే, ధూళి లేచి ఆకులో పడకుండా ఆహారం చుట్టూ కొద్దిగా నీళ్లు చల్లేవారు. ఆకు చుట్టూ తడి ఉండటం వల్ల చీమల వంటి కీటకాలు ఆహారం దగ్గరకు రావు. అప్పట్లో రాత్రిపూట వెలుతురు తక్కువగా ఉండేది. అందువల్ల ఏదైనా కీటకం ఆకులోకి వచ్చిందో లేదో చూడటం కష్టమయ్యేది. ఆకు చుట్టూ నీళ్లు చల్లడం వల్ల ఆ సమస్యలను తొలగించుకునేవారు. హిందూమతంలో ప్లేట్ చుట్టూ నీళ్లు చిలకరించడం ద్వారా నీరు, అగ్ని, సూర్యుడు అనే మూడు శక్తులను కలపవచ్చని విశ్వసిస్తారు.

ఈ మూడు శక్తులను గౌరవిస్తే ఆరోగ్యం, సంపద పెరుగుతాయని నమ్ముతారు. “పరిశేచనం” అనే పదాన్ని ఆహారం చుట్టూ, పైన నీళ్లు చల్లుకోవడానికే వాడతారు. పరిశేచనానికి ముందు, ఆహారాన్ని పవిత్రం చేయడానికి “మహా వ్యాహృతులు” (ఓంతో ముందు, వెనుక ఉండే పవిత్రమైన శబ్దాలు) చదవాలి. అలాగే గాయత్రీ మంత్రాన్ని మనసులో స్మరించుకోవడం ద్వారా భోజనాన్ని పవిత్రం చేయాలి. తరువాత, సంబంధిత పరిశేచన మంత్రాలను చదవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *