బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈమె ఇటీవల భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో సందడి చేసింది. తేజస్వని అందం హీరోయిన్స్ ని మించి ఉంది. ఇక ఆ వేడుకలో తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటసింహం బాలయ్యకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి బ్రాహ్మణి, రెండో అమ్మాయి తేజస్విని.. అబ్బాయి మోక్షజ్ఞ. అయితే ఇదిలాఉంటే అంతకు ముందే కూతురు తేజస్వినిని నిర్మాతగా పరిచయం చేస్తున్నారు బాలయ్య. బోయపాటి శ్రీనుతో ఇటీవల సినిమాని ప్రకటించిన విషయం తెలిసింది. బీబీ 4
గా రాబోతున్న ఈ మూవీకి తేజస్విని సమర్పకురాలిగా వర్క్ చేస్తున్నారు.
నిర్మాణంలోనూ భాగమవుతున్నారు. అయితే తేజస్వినికి మొదట్నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ అట. చాలా రోజులుగా బాలయ్య సినిమాలకి తెరవెనుక పనిచేస్తుందట. కాస్ట్యూమ్స్ సెలెక్షన్‌తోపాటు సినిమాల ఎంపికలోనూ ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. క్రియేటివ్ సైడ్ తేజస్విని చాలా ఆసక్తి ఉంటుందట. చాలా టాలెంటెడ్ కూడా అని చెప్పాడు ఆమె భర్త శ్రీ భరత్. ఆయన ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బాలయ్యకి అన్నీ తానై చూసుకుంటుందని చెప్పారు.
అన్ స్టాపబుల్ టాక్ షో విషయంలో ఆమె ఇన్ వాల్వ్ మెంట్ ఉందట. ఆమె గైడెన్స్ ప్రకారమే బాలయ్య చేస్తున్నారు. అంతకు ముందు బాలకృష్ణ అంటే కోపం ఎక్కువ, కొడతాడనే భావన ఉండేది, కానీ అన్ స్టాపబుల్ షో తర్వాత ఆయనలో హ్యూమర్ కూడా ఉందని జనాలకు తెలిసింది. మరో సైడ్ ఆడియెన్స్ కి బాలయ్య దగ్గరయ్యాడు. ఆ క్రెడిట్ తేజస్వినికి దక్కుతుందని తెలిపారు భరత్. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. తను సినిమాల్లోకి వచ్చి ఉంటే నటిగా చేస్తే పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండేదన్నారు. పాపులర్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకునేది అని తెలిపారు భరత్.
బాలయ్య ఎంకరేజ్ చేసి ఉంటే తేజస్విని ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తేజస్విని లుక్ పరంగా హీరోయిన్లకి ఏమాత్రం తక్కువ కాదు కదా, వాళ్లని మించి ఉంటుంది. ఈ క్రమంలో నిజంగానే నటిగా మారి టాలీవుడ్‌ని షేక్ చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. కానీ ఇప్పుడు క్రియేటివ్ సైడ్ ఆమె వర్క్ చేయబోతుంది. తెరవెనుక కథ నడిపించబోతుంది. నిర్మాతగా మెప్పించబోతుంది తేజస్విని.