ఆరోగ్యం

90 శాతం మందికి తెలియని రహస్యం, ఇలా చేస్తే నడుం నొప్పికి శాశ్వతంగా తగ్గిపోతుంది.

90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అయితే అయితే నడుం నొప్పి సమస్యకు నడక ఉత్తమ పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెన్ను కింది భాగంలో వచ్చే నొప్పి నివారణకు నడకే గొప్ప వ్యాయాయని అంటున్నారు. ఈ విషయాన్ని ఏదో ఆశామాషీగా చెప్పడం లేదు పలువురిపై పరిశోధన చేసి మరీ వెల్లడిస్తున్నారు.

ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇందుకోసం పలువురి పరిగణలోకి తీసుకొని వారిపై అధ్యయనం నిర్వహించిన తర్వాత ఈ వివరాలను వెల్లడించారు. ఈ వివరాలను ప్రముఖ హెల్త్‌ జర్నల్‌ అయిన ‘లాన్సెట్‌’లో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా మొత్తం 700 మంది వయోజనులను మూడు బృందాలుగా విభజించారు. వీరిలో ఒక బృందానికి వాకింగ్ చేయని సిఫార్స్‌ చేశారు.

రెండో బృందానికి ఆరు నెలలపాటు ఫిజియోథెరపి చేయమని చెప్పారు. ఒక మూడో జట్టుకు ఎలాంటి చికిత్సను సూచించలేదు. అనంతరం కొన్ని రోజుల తర్వాత సేకరించిన వివరాల ప్రకారం వీటన్నింటిలో వాకింగ్ బెస్ట్‌ ఆప్షన్‌గా నిర్ధారించారు. ఎలాంటి ఖర్చు లేకుండా రిస్క్‌ లేకుండా నడుం నొప్పిని తగ్గించుకోవడానికి వాకింగ్ ఒక్కటే బెస్ట్‌ ఆప్షన్‌ అని చెబుతున్నారు. వాకింగ్‌తో కేవలం వెన్ను నొప్పి తగ్గడమే కాదు, గుండె, రక్తనాళాలకు, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బరువు తగ్గిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. వెన్ను దిగువ భాగంలో నొప్పి.. 2020లో ప్రపంచవ్యాప్తంగా 62 కోట్లమందిని బాధించింది. 2050కల్లా 84 కోట్లమంది దీని బారిన పడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారత్‌లో 66 శాతంమంది వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది.. మహిళలు, గ్రామీణులు, శారీరక శ్రమ చేసే కూలీలే ఉండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *