ఎంటర్టైన్మెంట్

అతి త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య.

బేబి మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద సంచలనంగా మారింది. ఈ మూవీతో టాలీవుడ్‌లో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. తెలుగమ్మాయికి చాలా రోజుల తరువాత ఇలాంటి ఓ భారీ హిట్ రావడం, ఆమె పేరు టాలీవుడ్‌లో వినిపించడం జరిగింది. అయితే బేబి తరువాత వైష్ణవికి చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే సోషల్ మీడియా ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. అలా వచ్చిన వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. ఈ చిన్నది బేబీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది.

అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. అలాగే సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. ముఖ్యంగా అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా నటించింది. అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించింది.

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది. యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో రెండు షెడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించింది వైష్ణవి. ఇక ఈ అమ్మడు ఇటీవలే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశిష్ హీరోగా నటించిన ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్వరలోనే వైష్ణవి గుడ్ న్యూస్ చెప్పనుందని అంటున్నారు. ఇటీవలే వైష్ణవి చైతన్య, ఆశిష్ ప్రముఖ ఛానెల్ లో ఓ గేమ్ షోకి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆశిష్ వైష్ణవి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది అని అన్నాడు. వెంటనే యాంకర్ సుమ అందుకొని నీకు ఈ మధ్యనే పెళ్లయింది చెప్తే నువ్వు చెప్పాలి గుడ్ న్యూస్ అని కౌంటర్ ఇచ్చింది. ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే వైష్ణవి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా.? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగాఈ వైష్ణవి పెళ్లి చేసుకోబోతుందా.? కెరీర్ లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న వైష్ణవి అప్పుడే పెళ్లి చేసుకోదు.. ఓ పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని అంటున్నారు కొందరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *