తాజా వార్తలు

వాలంటీర్లపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, అసలు విషయం అదే అంటూ..?

ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉందన్నట్లుగా పలువురు వైసీపీ నేతలు స్పందించారు. కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పెన్షన్ ఈ రోజు పంపిణీ చేస్తున్నారు. అయితే వాలంటీర్ల కొనసాగింపు పై త్వరలో ఒక నిర్ణయం ఉంటుందని మంత్రులు చెప్పుకొస్తున్నారు.అయితే ఈరోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా సాగింది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులు సచివాలయ సిబ్బంది, టిడిపి నేతలు దగ్గరుండి మరి పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు. ఈరోజు సాయంత్రానికి శత శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నది లక్ష్యం. రాజధాని ప్రాంతం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించే ప్రక్రియను ప్రారంభించారు చంద్రబాబు.అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో.. ఏప్రిల్ మే నెలలో అప్పటి వైసీపీ సర్కార్ 33 మంది లబ్ధిదారులు చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లో సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయాలని తాము కోరినా.. వారు అలా చేయలేదన్నారు. అందుకే తాము అధికారంలోకి వచ్చి సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేసి చూపించమన్నారు.

సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సాయం తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్పామన్నారు. అయితే చంద్రబాబు నోటి నుంచి వాలంటీర్ల మాట వచ్చేసరికి వారిలో ఆశలు చిగురించాయి. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని వారు నమ్మకం పెట్టుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *