టాయిలెట్ సీటులో 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యానికి చాలా డేంజర్. టాయిలెట్ సీటులో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇధి సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే మనలో చాలా మంది రోజుకు ఎన్నిసార్లు టాయిలెట్ వెళ్తారో వారికే గుర్తుండదు. కొందరు గంటకు ఒకసారి వెళ్తే మరికొందరు రోజులో చాలా తక్కువ సార్లు మాత్రమే మూత్రవిసర్జన చేస్తారు.
మూత్ర విసర్జన మన శరరీ ఆరోగ్యంపై ఆదారపడి ఉంటుంది. మూత్ర విసర్జన అనేది ఎక్కువగా నీరు తీసుకునేవారు ఎక్కువసార్లు చేస్తారు, తక్కువగా నీరు తీసుకునేవారు తక్కువసార్లు చేస్తారు. అయితే మూత్ర విసర్జనకు పట్టే సమయాన్ని బట్టి కూడా మన ఆరోగ్య పరిస్థితిని గుర్తించవచ్చను తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మూత్ర విసర్జన ఎంత టైమ్‌లో పూర్తి చేస్తే వారు ఆరోగ్యంగా ఉన్నట్లో కూడా జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థుల బృందం వెల్లడించింది. 21 సెకన్లలో యూరిన్ చేయడం ఆరోగ్యకరమని వారు చేసిన పరిశోధనల ద్వారా తేల్చారు. తాజాగా ఈ బృందం ఈ విషయాన్ని వెల్లడించింది.
రోజుకు 8 గ్లాసులు వాటర్ తాగితే 8 సార్లు మూత్ర విసర్జన చేయాలని యూరాలజిస్ట్ నికల్ ఐసెన్ బ్రౌన్ తెలిపారు. పదేపదే మూత్రవిసర్జన చేసినా, తక్కువ సార్లు చేసినా ఆరోగ్యానికి నష్టమే జరుగుతుందని వారు చేసిన పరిశోధనల్లో తేలినట్లు వెల్లడించారు.