ఆమ్రపాలి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె 39వ ర్యాంక్ సాధించారు. తర్వాత ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా పనిచేశారు. అయితే యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా కాట్ర ఆమ్రపాలి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. విశాఖపట్నంకి చెందిన ఆమ్రపాలి 2010లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి ఐఏఎస్ అయ్యారు.
వరంగల్ అర్బన్ కలెక్టర్ గా పని చేసిన సమయంలో ఆమ్రాపాలి రాష్ట్ర ప్రజల దృష్టిని బాగా ఆకర్షించారు. తన డైనమిజంతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అతి చిన్న వయస్సులో ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి యూత్ ఫాలోయింగ్ ను సంపాదించింది. అందంలో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఆమ్రపాలి యూత్ ఐకాన్ గా మారారు.
తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో విధులు నిర్వహించిన ఆమ్రపాలికీ ఓ లవ్ స్టోరీ ఉంది. ఆమె ఓ యువకుడినీ ప్రేమించింది. అతను 2011 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మ. జమ్మూ కి చెందిన ఈ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆమ్రపాలి ప్రేమించుకోవడంతో ఇరు కుటుంబ సభ్యులు 2018 ఫిబ్రవరి 18న వీరి పెళ్లిని ఘనంగా జరిపించారు. కొద్ది మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
ఆ తరువాత ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి ఢిల్లీలో విధులు నిర్వహించింది. ఇటీవలే ఆమె తిరిగి తెలంగాణ కేడర్ కి బదిలీ పై వచ్చి హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టారు. ఈ యంగ్ ఐఏఎస్, ఐపీఎస్ ల పెళ్లి జరిగి ఆరేళ్లు అయిన సందర్భంగా ఈ వార్త మళ్లీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.