ఎంటర్టైన్మెంట్

నిండు గర్భంతో డ్యాన్స్ చేసిన అమలా పాల్, వైరల్ అవుతున్న వీడియో.

టాలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ గత కొన్నిరోజులుగా.. తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమలాపాల్ కు ఘనంగా సీమంతం వేడుకలు జరిగాయి. అయితే , ఈ వేడుకలనేవి గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించారు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు అమలా పాల్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే స్టార్ హీరోయిన్ అమలా పాల్ మాత్రం అలా ఉండనంటోంది. ప్రస్తుతం ఈ అందాల తార నిండు గర్భంతో ఉంది. రేపో మాపో బిడ్డను కూడా కనేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో’కౌంట్ డౌన్ స్టార్ట్ ‘ అంటూ ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోను చూస్తుంటే అమలా పాల్ కు ఇప్పటికే తొమ్మిది నెలలు నిండినట్టు తెలుస్తోంది. ‘బిడ్డ బయటకు వచ్చేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో అమలా పాల్ డ్యాన్స్ చేస్తూ.. తన పొట్టను ఊపేస్తూ కనిపిస్తుంది. ఇప్పడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇలా చేయడం బిడ్డ, తల్లి ఆరోగ్యానికే మంచిదేనని ఒకరు కామెంట్ చేస్తే, ఇలాంటి సమయంలో ఇలాంటివి వద్దు అని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.

ఇంకొందరు అమలా పాల్ త్వరలోనే ఆడబిడ్డ పుడుతుందంటూ.. కామెంట్స్ పెడుతున్నారు.అమలాపాల్.. దక్షిణాదితో పాటు ఈ మధ్యన బాలీవుడ్ లోనూ మెరుస్తోందీ అందా తార. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుందీ ముద్దగుమ్మ. అయితే సినిమాల్లో సక్సెస్ అయినట్లు పర్సనల్ లైఫ్ లో అమల సక్సెస్ కాలేదు. దర్శకుడు ఏ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా పాల్ కొన్నేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత గుజరాత్ కు చెందిన జగత్ దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కొన్నినెలల క్రితం తమ జీవితంలో మరో వ్యక్తి రాబోతున్నారంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది అమలా పాల్. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోందీ సొగసరి. ఇటీవల సీమంతం వేడుకలను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్ల తెగ వైరలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *