ఆరోగ్యం

మొలకెత్తిన ఆలుగడ్డలు అంత ప్రమాదకరమా..? పొరపాటునకూడా తినకండి, ఎందుకంటే..?

బంగాళ దుంపలను కూరలోనే కాదు సాంబర్ లోనూ వాడుతుంటారు. అయితే ఈ సంగతి పక్కన పెడితే బంగాలదుంపళను కొన్న కొన్ని రోజులకే మొలకలు వస్తూ ఉండటం మనం తరచూ చూస్తున్నదే. అయితే ఆ మొలకలొచ్చిన బంగాళ దుంపలను చాలా మంది అలాగే కూర వండుకుని తినేస్తుంటారు. అయితే ప్రస్తుతం చిప్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టంగా తింటున్నారు.

ఇక పొటాటోలో ఉన్న మరో అడ్వాంటేజ్‌ ఏమింటటే.. ఈసీగా వంట చేసుకోవచ్చు. తొందరగా పూర్తి చేయవచ్చు. ఆరోగ్యానికి కూడా పొటాటో మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే పొటాటోతో ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌ నుంచి చాలా మంది ఒకేసారి కిలోలకు కిలోల పొటాటోలు తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటారు. కూరగాయలు అయిపోయిన వెంటనే వాటిని వండుకోవచ్చని ఇలా చేస్తుంటారు.

అయితే నిల్వ చేయడం వలన పొటాటోలు మొలకలు వస్తాయి. మొకలు వచ్చాయంటే.. పొటాటోలు విషపూరితం అవుతాయి. మొకలతోపాటు పొటాట్లో పాయిజనెస్‌ కెమికల్‌ సోలనైన్, చాకొనైన్‌ రసాయనాలు పెరుగుతాయి. ఇలా మొలకలు వచ్చిన పొటాటోలు వండుకుని తింటే.. ఫుడ్‌ పాయిజన్‌ అవుతుంది. వాతులు అవుతాయి. నర్వ్‌ సిస్టమ్‌ సమస్యలు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. గర్భిణులు మొలకలు వచ్చిన పొటాటోలతో చేసిన వంటకాలు తింటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికైనా మొలకలు వచ్చిన పొటాటోలు తినడం మానేయండి. ఇక పొటాటో చిప్స్‌ తయారు చేసేవాళ్లు ఇలా పొటాటోలను క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటారు. దీంతో అవి మొలకలు వస్తాయి. అయినా వాటితోనే చిప్స్‌ తయారు చేస్తుంటారు. ఇక పొటాటో చిప్స్‌ తింటే.. శరీరంలో సోడియం శాతం పెరుగుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. గెండెకు సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ విషయాలను గమనించి మొలకలు వచ్చిన పొటాటోలు తినడం మానేయడం, పొటాటో చిప్స్‌ తినడం తగ్గించడం చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *