తాజా వార్తలు

హ్యాట్సాఫ్, తాగుబోతు భర్తని ప్రభుత్వ ఉద్యోగిగా మార్చిన భార్య.

ఓ విద్యార్థి 2000 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్ , డిగ్రీ, పీజీ , బీఈడీ వరుసగా అగ్రస్థానాలలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే ఈ విద్యార్థి ప్రతిభ చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని భావించారు. కానీ ఇక్కడ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లుగా ఆ విద్యార్థికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్న ఆవ గింజ అంత అదృష్టం కరువైందని చెప్పాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన ఒకటి లేదా అరమార్కు తేడాతో పోయేవి. దీనికి తోడు అతను అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో రిజర్వేషన్ కూడా కలిసి రాలేదు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాయి. అసలే పేద కుటుంబం పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి స్తోమత లేకపోవడంతో ప్రైవేట్ టీచర్ గా ఉద్యోగంలో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం రాక మనస్థాపం ఒకవైపు నేనే ఇంత చదివిన ఉద్యోగం తెచ్చుకోలేకపోయా నేను నా విద్యార్థులకు న్యాయం చేయగలనా అనే కుంగుబాటుతనం మరోవైపు. దీంతో అతను ప్రైవేట్ టీచర్ గా కూడా చేయలేకపోయాడు. ఆ విధంగా నిస్పృహకు లోనైనా ఆ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. నల్గొండకు చెందిన అతను ఎంతో ఉన్నత విద్యను చదివాడు.

ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఎన్నో కలలు కంటూ.. దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. కానీ, అతను ప్రభుత్వ పరీక్షలు రాసిన ప్రతి సారి ఒకటి అర మార్కులతో ఆ ఉద్యోగాన్ని కోల్పోయేవాడు. అతను ఓ వైపు ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేస్తూనే .. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఇంత చదువు చదివి ఏంటి ఇలా అనే ఆలోచనలు .. అతనిని బాగా కృంగదీశాయి. దీనితో అతను డిప్రెషన్ కు లోనయ్యి.. తాగుడుకు బానిస అయ్యాడు. అటు కన్న తల్లిదండ్రులు కూడా అతనికి నచ్చ చెప్పలేకపోయారు. దీనితో అతనికి మందు లేకపోతే రోజు గడిచేది కాదు.

దీనితో ఊరిలో వారంతా అంత చదువు చదువుకుని తాగుబోతు అయ్యాడని అతనిని ద్వేషిస్తూ, దూషిస్తూ ఉండేవారు. కానీ, అతని మరదలు మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా అతనిని పెళ్లి చేసుకుంది. చుట్టాలు, చుట్టూ ఉన్న వారు అంతా ఆమెను.. ఆమె భర్తను హేళన చేస్తున్న సరే.. అవన్నీ పట్టించుకోకుండా ఆమె తన ప్రేమతో తన భర్తను దారిలోకి తెచ్చుకుంది. అతనికి ఒక ఆటో కొనిచ్చి.. ఆటో నడుపుకునేలా చేసింది . మెల్లగా అతనిని మద్యం అలవాటు మానేలా చేసింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతా సజావుగానే సాగిపోతున్న సరే.. ఎంఎస్సి బిఈడీ చదువుకుని తన భర్త ఆటో నడుపుకోవడం ఏంటని.. ఆమె మళ్ళీ తన భర్త దృష్టిని చదువు వైపు మళ్లే ప్రయత్నాన్ని చేసింది.

అందుకోసం తన భర్త ఆటోని అమ్మేవేసి.. తానూ ప్రైవేట్ టీచర్ గా జాయిన్ అయ్యి.. ఆమె భర్త చదువుకునేందుకు పూర్తి స్వేచ్చని ఇచ్చింది. ఇదే చివరి అవకాశంగా భావించి అతను కష్టపడి చదివాడు .. సరిగ్గా అదే సమయానికి గురుకుల పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు ఉండడంతో.. అతని కష్టానికి ప్రతిఫలంగా ఆ ప్రభుత్వ ఉద్యోగం అతనిని వరించింది. ఎంతో మంది అతనిని నమ్మకుండా దూషించిన సరే.. కట్టుకున్న భార్య మాత్రం అతని చేయి విడవకుండా .. అండగా నిలిచి అతని కల సాకారం అయ్యేలా చేసింది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *