కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ అమ్మాయికి సంబంధించిన ప్రతి హోల్డింగ్స్ కనిపిస్తుంటాయి. అంతగా ఎయిర్ టెల్ సిమ్ యాడ్ ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అటు యాడ్.. ఈ అమ్మాయి రెండు ఫేమస్ అయిపోయాయి. యాడ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సాషా. అయితే ఎయిర్ టెల్ యాడ్ అమ్మాయి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సిమ్ యాడ్ ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఆమె నటించిన ఎయిర్ టెల్ యాడ్ ఒకప్పుడు బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఆ అమ్మాయికి కూడా గుర్తింపు రావడమే కాదు.. ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ ఎయిర్ టెల్ యాడ్ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. దీంతో ఇండస్ట్రీలో తెగ బిజీ అయిపోతుందనుకున్నారు.
కానీ ఉన్నట్టుండి ఈ ముద్దుగుమ్మ సైలెంట్ అయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ గత కొన్ని నెలలుగా ఎలాంటి పోస్ట్స్ షేర్ చేయడం లేదు. ఇంతకీ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదూ.. తన పేరు సాషా ఛెత్రి. ‘ఇంతకంటే వేగంగా నెట్‌వర్క్ వస్తే లైఫ్‌టైమ్ మొబైల్ బిల్లు ఫ్రీ…’ అంటూ టీవీల్లో చెప్పే అమ్మాయిని ఎయిర్‌టెల్ 4జీ అమ్మాయి అని కూడా పిలుస్తుంటారు జనాలు. ఈ నటి పేరు గుర్తుండకపోవచ్చు, కానీ మీరు ఈ ముఖాన్ని మరచిపోలేరు. ‘ఎయిర్‌టెల్ 4G గర్ల్’ అని పిలిచే ఈ అమ్మాయి సాషా.. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో జన్మించింది.
అక్కడే గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన సాషా.. ఆ తర్వాత ముంబై వెళ్లి అడ్వర్టైజింగ్ స్టడీ అభ్యసించింది. ఎయిర్ టెల్ యాడ్ చచేయడానికి ముందుకు సాషా ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ ట్రైనీ. ఈ యాడ్ కోసం ఆమెకు కాల్ వచ్చినప్పుడు ఫేక్ అని వదిలిపెట్టింది. కానీ ఆ తర్వాత 2015లో ఎయిర్ టెల్ యాడ్ చేసింది సాషా. ఈ యాడ్ ద్వారా ఒక్కసారిగా సాషా ఫేమస్ అయ్యింది. అంతేకాకుండా ఎయిర్ టెల్ వినియోగించేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ యాడ్ తర్వాత ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలిసారిగా కత్తిబట్టి చిత్రంలో కనిపించింది.
ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది. సాషా చివరిసారిగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో కనిపించింది. అయితే ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే ఆమె సైలెంట్ అయ్యింది. గతేడాది సెప్టెంబర్ నుంచి సాషా ఇన్ స్టాలో మరో పోస్ట్ చేయలేదు. ప్రస్తుతం సాషా ఎక్కడ ఉంది?.. ఏం చేస్తుంది? అనే విషయం ఎవరికీ తెలియదు.