తాజా వార్తలు

చనిపోయిన ప్రేమ జంట‌కు పెళ్లి చేసిన పెద్ద‌లు, ఇలా ఎందుకు చేసారో తెలిస్తే..?

యాంగ్, లీ అనే జంట నాలుగేళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు. జూన్ 2న యాంగ్ పుట్టిన‌రోజు కావ‌డంతో బ్యాంకాక్‌లో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌నుకున్నాడు. ఈ నేప‌థ్యంలో యాంగ్ త‌న ప్రేయ‌సి లీతో క‌లిసి కారులో ప్ర‌యాణిస్తుండ‌గా వారి కారు ప్ర‌మాదానికి గురైంది. ఆ జంట అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. అయితే మలేషియాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ అనే జంట మరణించారు. ఈ సంఘటన మే 24న పెరాక్‌లోని వాయువ్య ప్రాంతంలో జరిగింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. లీకి తనను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయడానికి జింగ్‌షాన్ తన పుట్టినరోజుని ఎంచుకున్నాడు.

ఈ మేరకు బ్యాంకాక్‌కు వెళ్లాలని ప్లాన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే దురదృష్టం ఈ జంటను వెంటాడింది. అతను తన ప్రేమని వెల్లడించి పెళ్లి చేసుకోమని అడిగే లోపు కారు ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఇప్పుడు ఈ లోకంలో లేరు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదం తర్వాత, రెండు ఇళ్లలోని కుటుంబాలు కలిసి ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. తమ పిల్లల ఆఖరి కోరిక తీర్చేందుకు వారు ‘ప్రేత వివాహం’ నిర్వహించారు.

ఇది చైనాలో ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయంలో ఇద్దరు పెళ్లికాని వ్యక్తులు చనిపోతే వారి ఆత్మలను వివాహం అనే పవిత్ర బంధంలో ఒకటి చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన తర్వాత కూడా ఇద్దరూ భార్యాభర్తలుగా కలకాలం ఉంటారని.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం. జింగ్షాన్ , లీ కుటుంబాలు గత సోమవారం అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన హాలులో ఈ ప్రత్యేకమైన వివాహ వేడుకను నిర్వహించాయి. ఇక్కడ మృతులైన యాంగ్ జింగ్షాన్, లి షుయింగ్ లకు వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుక కోసం కుటుంబ సభ్యులు పెళ్లి ఫొటో కూడా తయారు చేశారు.

జింగ్‌షాన్ కుటుంబం తమ సంతాప సందేశంలో లిని తమ కోడలుగా అంగీకరించింది. మృతులకు పెళ్లి చేసే ఆచారం చైనాలోనే కాదు, ఈ దేశాల్లో కూడా ఉంది, చైనీస్ జానపద నిపుణుడు హువాంగ్ జింగ్‌చున్ మాట్లాడుతూ.. ఇలా మరణించిన వ్యక్తులకు పెళ్లి చేసే సాంప్రదాయం ప్రియమైన వారిని కోల్పోయిన బంధువుల భావోద్వేగాలను తీర్చడంలో సహాయపడుతుంది. చైనీస్ సంస్కృతి ప్రభావంతో ఉత్తర కొరియా , జపాన్ వంటి అనేక తూర్పు ఆసియా దేశాలలో కూడా ఇలా ఆత్మలకు వివాహ చేసే ఆచారం ప్రబలంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *