ఆరోగ్యం

రాత్రి సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీ గుండె ప్రమాదంలో ఉందని అర్ధం.

నెయ్యి, వెన్న ఎక్కువగా తీసుకుంటే.. ఖచ్చితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. వీటి వల్ల గుండె జబ్బులు ప్రమాదం అనేది పెరుగుతుంది. కానీ నెయ్యిలో మాత్రం ఆరోగ్యకరమైన లక్షణాలు అనేవి ఉన్నాయి. నెయ్యిలో విటమిన్లు ఎ, డి, కెలతో పాటు కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ల కూడా లభ్యమవుతుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అయితే రోజురోజుకూ గుండె పోటు రావడం ఎక్కువ అవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే జీవనశైలికి సంబంధించిన అజాగ్రత్తగా ఉండటమే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అంటున్నారు నిపుణులు. కొందరిలో గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీలో మాత్రమే నొప్పి రావాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే కొన్నిసార్లు భుజంలో తీవ్రమైన నొప్పి, అలసట, చెమట మొదలైనవి వస్తుంటాయట.రాత్రిపూట కడుపు, భుజాలు, వీపు, దవడ, మెడ లేదా గొంతులో నొప్పి వస్తుంటే కూడా జాగ్రత్తగా ఉండాలి.

ఇక మహిళల్లో ఛాతీ కింద ఎక్కువ నొప్పి వస్తుంటుంది. కొందరు మాత్రం దీనిని ఎసిడిటీగా పరిగణిస్తారు. అయితే ఇలాంటి నొప్పి అసిడిటీ వల్ల రావచ్చు. కానీ మీకు చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడం లేదా అలసిపోయినట్లు అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించడం బెటర్. నిద్రపోయేటప్పుడు ఎక్కువగా చెమట వస్తే గుండె సమస్య అనుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో కూడా డాక్టర్ సలహా తీసుకోవాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కూడా గుండె జబ్బు వస్తుందని అనుకోవాలి.

గుండె జబ్బులు వస్తే గుండె మరింత సమస్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రతి అవయవానికి రక్తాన్ని గుండెనే సరఫరా చేస్తుంది. దీని వల్ల అలసిపోయిన ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా డాక్టర్ ను సంప్రదించాలి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్నా తేలికగా తీసుకోవద్దు. తరచుగా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధ పడితే, ప్రత్యేకించి 60 ఏళ్లు పైబడిన వారైతే, పూర్తి బాడీ చెకప్ చేయించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *