ఎంటర్టైన్మెంట్

వేణుస్వామి నిజ స్వరూపం ఇదే, రెడ్ హ్యాండెడ్‌గా ఎలా దొరికడో చుడండి.

సినీ నటులు, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో తనకు తోచిన విధంగా జోస్యాలు చెప్పడం కొంత వరకు వేణు స్వామికి వర్క్ అయ్యాయి. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా బెడిసి కొట్టడమే కాకుండా ఏకంగా ఆయన అస్థిత్వానికే ముప్పు తెల్చేలా మారాయి. దాంతో ఆయన జోస్యంలో, జాతకాలు చెప్పడంలో నమ్మకం ఎంత అనే విషయంపై అనుమానాలు రేకెత్తాయి. అయితే ఇటీవల వేణు స్వామికి వరుస షాక్స్ తగిలాయి.

ఆయన జ్యోతిష్యం ఘోరంగా దెబ్బతింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తెలుస్తాడని వేణు స్వామి చెప్పారు. అలాగే ఐపీఎల్ లో హైదరాబాద్ విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. ఏపీలో మళ్ళీ జగన్ సీఎం అన్నాడు. ఈ మూడు అంచనాలు ఫెయిల్ అయ్యాయి. కీలక విషయాల్లో ఆయన జ్యోతిష్యం విఫలం చెందిన నేపథ్యంలో ఇకపై సినిమా తారలు, రాజకీయ నాయకుల జాతకాలు పబ్లిక్ గా చెప్పను. జోతిష్యం మానేస్తున్నాని వీడియో విడుదల చేశారు.

వేణు స్వామి విపరీతమైన ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇదిలా ఉండగా పూజలు పునస్కారాలు చేసే వేణు స్వామి పబ్లిక్ లో చేసిన పని హాట్ టాపిక్ అవుతుంది. ఇది వేణు స్వామి నిజ స్వరూపం అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. వేణు స్వామి వీకెండ్ మందు కొట్టేందుకు బార్ కి వెళ్ళాడు. ఓ టేబుల్ వద్ద మిత్రుడితో కూర్చుని మద్యం సేవించాడు. వేణు స్వామిని చూసిన కొందరు ఫోటోలు, వీడియోలు తీశారు.

అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పబ్లిక్ ఫిగర్ అందరికీ తెలిసేలా మందు కొట్టడం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వేణు స్వామి గతంలోనే చెప్పాడు. నాకు మందు అలవాటు ఉంది. వీకెండ్ బార్ కి వెళ్లి మందు తాగుతాను అన్నారు. నా ప్రొఫెషన్ వేరు పర్సనల్ లైఫ్ వేరు. పూజలు చేసే మాకు వ్యక్తిగత జీవితం ఉండదా… అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *