ఎంటర్టైన్మెంట్

రాజమౌళి సినిమా చేయనని రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎస్. ఎస్. రాజమౌళి 1973 అక్టోబరు 10న జన్మించారు తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. అయితే ఇక సరిగ్గా 14ఏళ్ల కిందట రిలీజై ‘మర్యాద రామన్నా’ ఊహించని రేంజ్‌లో హిట్టయింది.

అప్పటికే ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘మగధీరా’ ఇలా ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసిన రాజమౌళి.. అనూహ్యంగా సునీల్ తో మర్యాద రామన్నా చేస్తున్నట్లు ప్రకటించి అందరకీ షాక్ ఇచ్చాడు. రాజమౌళి కబురంపితే చాలు.. స్టార్ హీరోలు అలా వాలిపోతారు. అలాంటిది సునీల్ తో చేయడం ఏంటనీ తలలు అప్పట్లో తలలు పీక్కున్న సినీ సెలబ్రెటీలెందరో..కట్ చేస్తే, సునీల్ తో మర్యాద రామన్న తీసి అరివీర భయంకర హిట్టు కొట్టాడు. మగధీరలాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సునీల్ లాంటి కమెడీయన్ ను హీరోగా పెట్టి బంపర్ హిట్ కొట్టాడంటే రాజమౌళి విజన్ ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేవలం రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ లో ఏకంగా రూ.40 కోట్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్ లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. నిజానికి ఈ సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సునీల్, సలోని మధ్య సీన్లు ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా వల్ల సునీల్ కు ఎంత క్రేజ్ వచ్చిందో.. హీరోయిన్ సలోని కూడా మంచి పేరే వచ్చింది. అయితే సలోని మాత్రం కథల ఎంపికలతో తప్పటడుగులు వేసి కెరీర్‌ను స్పాయిల్ చేసుకుందుని పలువురు నెటీజన్లు భావిస్తుంటారు. ఇక కమెడియన్‌గా ఓ స్థాయి వరకు వెళ్లిన సునీల్‌కు మర్యాద రామన్న హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది.

కానీ.. అదే తనకు నెగెటీవ్ కూడా అయింది. మర్యాద రామన్న తర్వాత కూడా కమెడియన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తే సునీల్‌ ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉండేవాడు. కానీ హీరోగా సినిమాలు చేయడం స్టార్ట్ చేసి.. కమెడియన్ ఆఫర్లను రిజెక్ట్ చేసుకంటూ వచ్చాడు. దాంతో సునీల్ కెరీర్ ఒక టైమ్‌లో ప్రశ్నార్థకంగా మారింది. కానీ మళ్లీ ఇప్పుడు సపోర్టింగ్ యాక్టర్‌గా టర్న్ తీసుకుని భారీ బడ్జెట్ సినిమాలతో పాటు.. ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ తెగ బిజీగా గడుతున్నాడు. ప్రస్తుతం సునీల్ చేతిలో పుష్ప సీక్వెల్ తో పాటు మరో అరడజన్ సినిమాలకు పైగానే చేతిలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *